‘వరలక్ష్మి టిఫిన్స్’ ఓనర్ అరెస్టు.. మొన్న డ్రగ్స్.. ఈసారి పెళ్లి పేరుతో మోసం!

చూసేందుకు చిన్నగా కనిపించినా చేసే బిజినెస్ మాత్రం చాలా ఎక్కువగా చెబుతుంటారు.

Update: 2024-08-26 05:15 GMT

హైదరాబాద్ మహానగరంలో పేరొందిన టిఫిన్ సెంటర్లలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఒకటి. టిఫిన్ సెంటర్ అంటే.. భారీ సెటప్ అంటూ పెద్దగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. చూసేందుకు చిన్నగా కనిపించినా చేసే బిజినెస్ మాత్రం చాలా ఎక్కువగా చెబుతుంటారు. నిత్యం బిజీబిజీగా ఉంటూ.. బిజినెస్ కు ఏ మాత్రం ఢోకా లేని వేళ.. దరిద్రపుగొట్టు పనులు చేస్తూ అరెస్టు అవుతున్న వైనం చూస్తే.. విస్మయానికి గురికాక మానదు.

ఆ మధ్యన డ్రగ్స్ అమ్మకం ఆరోపణలతో అరెస్టు అయిన వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డి అరెస్టు అయ్యారు. కొంతకాలం తర్వాత బెయిల్ మీద విడుదలైన అతనిపై తాజాగా మరో కేసు నమోదైంది. ఈసారి మహిళను మోసం చేసిన కేసు అతనిపై బుక్ అయ్యింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినట్లుగా ఆరోపణలతో ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు అతడ్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

గచ్చిబౌలి ఇంద్రానగర్ లో ఉంటున్న 40 ఏళ్ల ప్రభాకర్ రెడ్డి.. నగరంలో పలుచోట్ల వరలక్ష్మి టిఫిన్ సెంటర్ పేరుతో టిఫిన్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. ఏపీకి చెందిన 30 ఏళ్ల యువతితో అతనికి కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి కొంతకాలం ఉన్నారు. పెళ్లి పేరుతో ఆమెను మోసం చేసినట్లుగా అతడిపై కంప్లైంట్ పోలీసులకు అందించింది.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిపై ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసుల్ని నమోదు చేశారు. తాజాగా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇలా నిత్యం ఏదో ఒక నేరారోపణపై అరెస్టు అవుతున్న వైనం సంచలనంగా మారింది.

Tags:    

Similar News