మోడీకి బాబుకి మధ్య గ్యాప్ పెంచేలా వైసీపీ ఎంపీ ట్వీట్!

ఇంతకీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఏంటి అంటే చాలా సంచలనమైనదే. 2018లో ఎన్డీయే నుంచి టీడీపీ విడిపోయింది.

Update: 2024-11-10 15:13 GMT

దేశానికి మూడోసారి ప్రధాని అయిన నరేంద్ర మోడీకి ఏపీలో నాలుగవ సారి సీఎం అయిన చంద్రబాబుకు మధ్య గ్యాప్ పెంచేలా ఒక హాటెస్ట్ ట్వీట్ ని వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి రిలీజ్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా మోడీకి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసి ఇదీ బాబు సంగతి అని మరోసారి చెప్పదలచుకున్నా రా లేక అదే సమయంలో బాబుకు గతాన్ని గుర్తు చేస్తూ ఇరకాటంలో పెట్టదలచుకున్నారా అంటే ఏమో ఆయన ట్వీట్ వెనక చాలా వ్యూహాలే ఉన్నాయని అంటున్నారు.

ఇంతకీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఏంటి అంటే చాలా సంచలనమైనదే. 2018లో ఎన్డీయే నుంచి టీడీపీ విడిపోయింది. ఆ టైం లో నరేంద్ర మోడీని అప్పటి సీఎం చంద్రబాబు గట్టిగా విమర్శించేవారు. ఆ నేపథ్యంలో మోడీ తల్లిని ఆయన భార్యను కూడా వ్యక్తిగతంగా వివాదంలోకి తీసుకుని వచ్చారు అని నాడు అంతా అనుకున్నారు.

అది ఇపుడు వైసీపీకి పొలిటికల్ గా ఆయుధంగా మారిందా అన్నది చర్చకు వస్తోంది. విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ ఈ రోజు వ్యక్తిత్వ హననం గురించి నీతులు చెబుతున్న చంద్రబాబు తన రాజకీయ జీవితంలో అంతా ఇతరులను దారుణంగా నిందిస్తూ వారి క్యారెక్టర్లను అసాసినేట్ చేస్తూ వెళ్లారని ఘాటైన విమర్శలు చేశారు

నరేంద్ర మోడీ తల్లిని సైతం రాజకీయాల్లోకి లాగి ఆమె గురించి ప్రస్తావించింది ఎవరు అని ట్వీట్ ద్వారా నేరుగా బాబుని ప్రశ్నించారు. అలా మోడీ సతీమణిని బహిరంగంగా నిందించింది ఎవరు అన్న ప్రశ్నను కూడా సంధించారు. బుల్ బుల్ హిందీలో హిందీలో ఇష్టారాజ్యంగా మాట్లాడింది ఎవరి మీద అని బాలయ్య అప్పట్లో ధర్మ పోరాట దీక్షలో మోడీ ప్రభుత్వాన్ని విమర్శించిన దాన్ని గుర్తు చేశారు.

అంతే కాదు వైఎస్సార్ కుమార్తెను వేధించేందుకు అప్పట్లో ఇంటి నుంచే వెబ్ సైట్లను నడిపింది ఎవరూ అని ప్రశ్నించారు. వీటన్నింటి కంటే ముందు సొంత మానను ఆయన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ నడి రోడ్డు మీద నిలబెట్టినది ఎవరు అని కూడా విజయసాయిరెడ్డి ప్రశ్నించరు.

తన అత్త గారి మీద అవాకులు చవాకులు పేలింది ఎవరు అని మరో ప్రశ్న సంధించారు. మీ గురించి చెప్పాలీ అంటే ఒకటా రెండా రాజకీయాల్లో మొదటి నుంచి ఇదే విధంగా వ్యక్తిత్వ హననం చేస్తూ ఇపుడు నీతులు వల్లించడం మీకే చెల్లింది అంటూ చంద్రబాబు మీద ఘాటైన విమర్శలే పరోక్షంగా విజయసాయిరెడ్డి చేశారు.

ఇక అవు పొలంలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని మధ్యలోకి నారా లోకేష్ ని కూడా లాగారు. మొత్తానికి చూస్తే చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అసభ్య అనుచిత పోస్టింగులు పెడుతున్నారని వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయించడం మీద విజయసాయిరెడ్డి అలా ఘాటు కామెంట్స్ చేశారు అన్న మాట.

ఈ మధ్యలో ఆయన అంశాలను తీసుకుని వచ్చారు. అలాగే ఎపుడో ఆరేళ్ల క్రితం మోడీ మీద చంద్రబాబు విమర్శలను అంతా మరచిపోయారు అనుకుంటే వాటిని మళ్లీ తెచ్చి ముందు పెట్టడం ద్వారా మోడీకి బాబుకు మధ్య కుదిరితే గ్యాప్ పెంచేయడానికి కూడా చూసారా అన్న చర్చ కూడా సాగుతోంది.ఏది ఏమైనా సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్ కాదు కానీ వైసీపీ వర్సెస్ కూటమిగా ఏపీ పాలిటిక్స్ గరం గరం గా మారింది.ఇందులోకి పాత విషయాలూ చర్చకు వస్తున్నాయి,మరిన్ని ముందు ముందు వస్తాయేమో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News