వైఎస్సార్ కు ఘన నివాళి.. జగన్, షర్మిలతో విజయమ్మ!

అవును... వైఎస్సార్ 75వ జయంతిని పురష్కరించుకుని వైఎసీపీ అధినేత జగన్ ఇడుపుల పాయలో తన తండ్రికి నివాళులు అర్పించారు.

Update: 2024-07-08 05:47 GMT

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు.. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సమయంలో జగన్ వెంట వైఎస్ విజయమ్మ, భారతి ఉన్నారు. అనంతరం షర్మిళ కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు.


అవును... వైఎస్సార్ 75వ జయంతిని పురష్కరించుకుని వైఎసీపీ అధినేత జగన్ ఇడుపుల పాయలో తన తండ్రికి నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా... ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసిన జగన్.. అనంతరం సమాధి వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఘాట్ వద్దకు చేరుకున్న విజయమ్మ.. వైఎస్ జగన్ ను ఆలింగనం చేసుకుని కంటతడి పెట్టారు.


తర్వాత ఇద్దరూ కలిసి స్మారకంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. వైఎసీపీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్, విజయమ్మ కలవడం ఇదే తొలిసారి! ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

అనంతరం వైఎస్సార్ కు జగన్ నివాళులు అర్పించిన వెళ్లిన అరగంట తర్వాత ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. అనంతరం తల్లి విజయమ్మ, భర్త అనిల్, కుమారుడు, కోడలు, కుమార్తెతో కలిసి నివాళులు అర్పించారు.

మరోపక్క వైఎస్సార్ 75వ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయంతిని పురష్కరించుకుని.. రక్తదానం, పేదలకు వస్త్రాలు పంపిణీ, ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం మొదలైన సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేస్తున్నారని తెలుస్తుంది.

Tags:    

Similar News