విజ‌య‌వాడ టీడీపీలో అల‌జ‌డి... ఆ సీటు కోసం ఫైటింగ్‌...!

క‌, ఇటు తూర్పు, అటు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల బ‌లాబ‌లాలు చూసుకుంటే.. ఈ రెండు టికెట్ల‌ను కొరు తున్న జ‌న‌సేన ప‌రిస్థితి ఎలా ఉందనేది ఆస‌క్తిగా మారింది.

Update: 2023-12-21 12:30 GMT

విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌పై టీడీపీలో తీవ్ర అల‌జ‌డి నెల‌కొంద‌నే చెప్పాలి. వ‌చ్చే ఎన్ని క‌లకు సంబంధించి.. ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని త‌మ‌కు కేటాయించాల‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని వ‌ర్గం డిమాండ్ చేస్తోంది. ఈ వివాదం కొన‌సాగుతుండ‌గానే.. సిట్టింగ్ ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ పార్టీ కార్య‌క్రమాల‌కు అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ ద‌క్కుతుందా? లేదా? అనేది ఆయ‌న సందేహంగా ఉంది.

ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సార్లుగా గ‌ద్దె రామ్మోహ‌న్ విజ‌యం సాధించారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబం దించి మాత్రం ఆయ‌న‌కు టికెట్ ద‌క్కుతుందా? లేదా? అనేది ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. ఈ నేప‌థ్యం లోనే గ‌ద్దె పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ఇక‌, మ‌రోవైపు.. జ‌న‌సేన నుంచి ఈ టికెట్ కావాల‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్నిక‌ల‌కు మ‌రో రెండు మాసాలే గ‌ట్టిగా స‌మ‌యం ఉన్న నేప‌త్యంలో జ‌న‌సేన నుంచి ఒత్తిడి మ‌రింత పెరుగుతుంద‌ని అంటున్నారు.

ఇదే జ‌రిగితే.. ఇటు ప‌శ్చిమ‌, అటు తూర్పులోనూ.. జ‌న‌సేన‌కు కేటాయిస్తార‌నే ప్ర‌చారం ఉంది. అయితే.. ఇలా కీల‌క‌మైన రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌ను టీడీపీకి వ‌దిలేస్తే.(వీటిలో ఒక‌టి ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ విజ‌యం దక్కించుకున్న ప‌రిస్థితి లేదు) విజ‌య‌వాడ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు కోల్పోతామా? అనే సందేహాలు నేత‌ల మ‌ధ్య వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు.. పార్టీలోనూ ఈ రెండు టికెట్ల వ్య‌వ‌హారంపై ఎలా తేల్చుకోవాల‌నేది కూడా స‌మ‌స్య‌గా మారింది.

ఇక‌, ఇటు తూర్పు, అటు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల బ‌లాబ‌లాలు చూసుకుంటే.. ఈ రెండు టికెట్ల‌ను కొరు తున్న జ‌న‌సేన ప‌రిస్థితి ఎలా ఉందనేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం తూర్పులో అస‌లు జ‌న‌సేన‌కు అభ్య ర్థి లేడు. కేవ‌లం ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్ర‌మే జ‌న‌సేనకు పోతిన మ‌హేష్ ఉన్నాడు. తూర్పులో మాత్రం అభ్య‌ర్థి కోసం వెతుకుతున్న‌ట్టు తెలుస్తోంది. కాపు సామాజిక వ‌ర్గం ప‌రంగా.. చూసుకుంటే తూర్పు వేస్ట్ అయిన‌ప్ప‌టికీ.. విజ‌య‌వాడ న‌గ‌రంపై ప‌ట్టు పెంచుకునేందుకు ఈ నియోజ‌క‌వ‌ర్గం కోరుతున్న‌ట్టు జ‌న‌సేన నాయ‌కుల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది. మ‌రి చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News