డిప్యూటీ స్పీకర్ ఎవరు? ఎందుకు తేలలేదు?
ఈ నేపథ్యంలో అప్పుడు డిప్యూటీ స్పీకర్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అయితే.. ఇది బీజేపీకి ఇస్తారా? అనే చర్చ జరుగుతోంది.
ఏపీ అసెంబ్లీకి సంబంధించి స్పీకర్ ను ఎన్నుకున్నారు. సీనియర్ రాజకీయ నాయకుడు, ఏడు సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు మంత్రిగా పనిచేసిన చింతకాయల అయ్యన్నపాత్రుడిని స్పీకర్‌గా ఎన్నుకున్నారు. దీనికి కూటమిలోని అన్ని పార్టీలూ ఏకగీవ్రంగా అంగీకారం తెలిపాయి. ఆయన ఎన్నికల, లాంఛనాలు కూడా పూర్తయ్యాయి. అయితే.. ఇప్పుడు మరో కీలక పరిణా మం.. డిప్యూటీ స్పీకర్. ఈ పదవిని ఎవరికి ఇస్తారనే విషయం ఇంకా తేలలేదు. నిన్న మొన్నటి వరకు అటు స్పీకర్, ఇటు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఒకేసారి ఉంటుందని అందరూ భావించారు.
కానీ, స్పీకర్‌ను ఎన్నుకున్న పార్టీలు డిప్యూటీ స్పీకర్ విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోలేదు., అయితే.. దీనికి ప్రధాన కార ణం.. స్పీకర్‌ను ఎన్నుకునే విషయంలో రాజ్యాంగబద్ధమైన ప్రొటోకాల్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 30 రోజుల్లో సభా స్పీకర్‌ను ఎన్నుకోవాలనేది రాజ్యాంగం చెబుతున్న ప్రొవిజన్స్. అందుకే.. ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల్లోనే సభ కొలువు దీరి.. స్పీకర్‌ను ఎన్నుకుంది. ఇది పార్లమెంటుకు కూడా వర్తిస్తుంది. అక్కడ కూడా ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత..స్పీకర్ ఎన్నిక 30 రోజుల్లోనే చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనను అన్ని రాష్ట్రాలు పాటిస్తాయి. ఎందుకంటే.. రాజ్యాంగబద్ధమైన నిర్దేశం కావడమే.
అయితే.. డిప్యూటీ స్పీకర్ అనేది రాజ్యాంగంలో పేర్కొనని అంశం. రాజ్యాంగంలో ఎక్కడా కూడా.. డిప్యూటీ స్పీకర్ విషయాన్ని ప్రస్తావించలేదు. అది పార్లమెంటు అయినా.. అసెంబ్లీ అయినా.. ఒకే నిర్దేశం.
సో.. దీంతో దీనిని ఎప్పుడైనా నిర్ణయించుకునే అవకాశం ఉంది. పైగా రాజ్యాంగ బద్ధమైన పదవి కాకపోవడంతో ఎలాంటి పవర్స్ కూడా ఉండవు. పైగా.. నామినల్ పదవి మాత్రమే. దీంతో ఈ పదవికి ఎంపిక సహజంగానే ఆలస్యమవుతుంది. ఇక, ఏపీ విషయానికి వస్తే.. వచ్చే నెల 27న బడ్జెట్ సమావేశాలు ప్రారంభనున్నాయి.
ఈ నేపథ్యంలో అప్పుడు డిప్యూటీ స్పీకర్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అయితే.. ఇది బీజేపీకి ఇస్తారా? అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. బీజేపీకి ఒక మంత్రి పదవి మాత్రమే దక్కిన నేపథ్యంలో ఉప సభాపతిగా కామినేని శ్రీనివాసరావుపేరును పరిశీలిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ తమకే కావాలంటూ.. జనసేన పట్టుబడితే.. మహిళా ఎమ్మెలయే నెల్లిమర్ల సభ్యురాలు.. లోకం మాధవికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఏదేమైనా.. పదవీ ప్రాధాన్యం లేకపోవడంతో ఇప్పటికిప్పుడు ఎంపిక చేయలేదని సమాచారం.