సడెన్ గా బొత్స సైలెంట్ అయ్యారేంటి ?
ఆ మీదటా శాసనమండలిలో ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కింది.
ఉత్తరాంధ్రాలో వైసీపీకి సంబంధించి చక్రం తిప్పుతారు అని ఒక రేంజిలో ఆయన గురించి ప్రచారం సాగింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలు అయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం రూపంలో మళ్లీ లక్ తగిలింది.ఆ మీదటా శాసనమండలిలో ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కింది. దీంతో ఇక ఆయన నంబర్ టూ గా వైసీపీలో ఉంటారు అని అంతా అనుకున్నారు.
ఈ కీలక పదవి తరువాత బొత్స సత్యనారాయణ ఒక స్థాయిలో అధికార టీడీపీ కూటమి మీద విమర్శలు చేస్తారని వైసీపీలో లౌడ్ వాయిస్ గా ముందుకు వస్తారని అనుకున్నారు. అయితే బొత్స మాత్రం ఎందుకో సడెన్ గా సైలెంట్ అయ్యారు అని అంటున్నారు.
ఆయన మీడియా ముందుకు వచ్చి చాలా రోజులు అయింది అని అంటున్నారు. ఇంతకీ బొత్స ఎక్కడ ఉన్నారు ఏమి చేస్తున్నారు అంటే ఆయన తన సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో ఉన్నారని అంటున్నారు. ఆయన అక్కడ తన బలాన్ని పెంచుకునే వ్యూహంలో ఉన్నారు.
ఇదిలా ఉండగా బొత్స బెజవాడ వరదల తరువాత కొంత చురుకుగానే వ్యవహరించారు. ఆయన విజయవాడలో కొన్ని చోట్ల తిరిగి బాధితులను పరామర్శించారు. అయితే అక్కడ వారి నుంచి ప్రశ్నల వర్షం కురవడంతో పాటు టీడీపీ సర్కార్ సహాయం చేస్తూంటే వైసీపీ వారే అడ్డుకుంటున్నారు అని డైరెక్ట్ గానే వైసీపీ నేతల మీద ఆవేశపడ్డారని ప్రచారం జరిగింది.
పైగా ఇపుడేనా రావడం అని నిలదీశారని కూడా టాక్ నడచింది. అలా బొత్స కొంత వరకూ కనిపించారు. మళ్లీ ఆయన వైసీపీ నుంచి రాజకీయ తెర మీద కనిపించలేదు. ఈ మధ్యలో చాలా పరిణామాలు జరిగాయి. జగనే ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లను అడ్డుగా పెట్టించి అక్కడ అతి పెద్ద ముప్పుకు కారణం అయ్యారని టీడీపీ తీవ్రమైన ఆరోపణలు చేస్తే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ దానిని ఖండించారు.
బొత్స మాత్రం కనిపించలేదు అన్న చర్చ వచ్చింది. మరి బొత్స ఎందుకు మౌనంగా ఉన్నారు అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. ఆయన ఈ కీలకమైన సమయంలో గొంతు విప్పాల్సి ఉందని అంటున్నారు. అపొజిషన్ లీడర్ గా ఆయనే ముందు ఉండాలని అంటున్నారు.
అయితే వైసీపీలో ఇటీవల అనేక మంది సీనియర్ నేతలు పార్టీని వదిలి పోతున్నారు. అదే విధంగా మొదటి నుంచి పార్టీలో ఉన్న వారు కూడా సైలెంట్ అయ్యారు. శాసనమండలిలో చూస్తే వైసీపీ ఎమ్మెల్సీలు ఎంతమంది ఉంటారో కూడా తెలియడం లేదు.
దీంతోనో ఆచీ తూచీ స్పందించాలని భావించే బొత్స కొంత తగ్గి ఉంటారని అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయ వ్యూహాలలో దిట్టగా పేరు తెచ్చుకున్న బొత్స మాట్లాడినా లేక మాట్లాడకపోయినా కూడా చర్చగానే ఉంటుంది అని అంటున్నారు