వైసీపీ కోసం ఆర్.ఆర్.యాక్ట్... చంద్రబాబుకు యనమల లేఖ!

ప్రస్తుతం నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతిపెద్ద సవాలుగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Update: 2024-07-02 10:22 GMT

ప్రస్తుతం నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతిపెద్ద సవాలుగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సుమారు 7వేల కోట్లు అప్పు చేశారని చెబుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే అప్పుల కుప్ప అయిపోద్దని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు లేఖ రశారు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.

అవును... ఏపీ ఆర్థిక పరిస్థితి, ఆర్థికాభివృద్ధికి తన పరిశీలనను వివరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. ఈ సందర్భంగా... గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం ఆర్థిక నష్టాన్ని అధిగమించేందుకు.. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన పురోగతి చర్యలు అభినందనీయమని అన్నారు. గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో కొత్త ప్రభుత్వానికి పలు అంశాలను సూచించారు. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యానికి ఈ సూచనలు కలిసొస్తాయని అభిప్రాయపడ్డారు.

ఇందులో భాగంగా... సంక్షేమ పథకాలకు అర్హులే లక్ష్యంగా పెట్టుకోవాలని యనమల సూచించారు. ఇదే సమయంలో... మూలధన వ్యయంలో లీకేజీలను ఆరికట్టాలని సూచించిన ఆయన.. ఏపీని పారిశ్రామిక గమ్యస్థానంగా మార్చాలని తన లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా... ఇప్పుడు ఉన్నదాని కంటే ఎక్కువ గ్రాంట్-ఇన్-ఎయిడ్, సహేతుకమైన స్థిర రుణాలు, పన్ను ఆదాయాలను క్రమబద్దీకరించడం వంటి అంశాలపై కేంద్రాన్ని అభ్యర్థించాలని యనమల సూచించారు.

ఇదే క్రమంలో... వేస్ అండ్ మీన్స్, ఓడీని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించిన యనమల... సమృద్ధిగా ఆదాయాన్ని అందించే సహజ వనరులను రక్షించాలని కోరారు. అదేవిధంగా... ఎఫ్.ఆర్.ఎం.బీ చట్టంలో ఉన్న ఆర్థిక క్రమశిక్షణ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించడం ద్వారా లోటు ప్రస్తుతం నియంత్రించి, వచ్చే సంవత్సరాల్లో తగ్గించాలని సూచించారు.

అదేవిధంగా అన్ని బిల్లుల చెల్లింపులు సీ.ఎఫ్.ఎం.ఎస్ ద్వారా మాత్రమే చేయాలని.. రాష్ట్ర ఆర్థిక పురోగతి కోసం అనుకూల వాతావరణాన్ని వేగవంతం చేసేందుకు అవినీతిని నిర్మూలించాలని యనమల సూచించారు. ఈ సమయంలోనే... వైసీపీ నేతల అక్రమార్జనను రెవిన్యూ రికవరీ యాక్ట్ (ఆర్.ఆర్. యాక్ట్) లేదా మరో ప్రత్యేకమైన చట్టంతో ముందుకు రావాలని యనమల రామకృష్ణుడు.. సీఎం చంద్రబాబు సూచించారు.

Tags:    

Similar News

eac