వైసీపీ ఐదో జాబితా...ఎమ్మెల్యేలే ఎంపీలుగా...!

వైసీపీ ఐదో జాబితా ఎట్టకేలకు రిలీజ్ అయింది. అయితే ఇందులో కేవలం ఏడు చోట్లకు మాత్రమే ఇంచార్జీలను నియమించారు. మూడు పార్లమెంట్ సీట్లకు అలాగే నాలుగు అసెంబ్లీ సీట్లకు ఇంచార్జిలను నియమించారు.

Update: 2024-01-31 17:03 GMT

వైసీపీ ఐదో జాబితా ఎట్టకేలకు రిలీజ్ అయింది. అయితే ఇందులో కేవలం ఏడు చోట్లకు మాత్రమే ఇంచార్జీలను నియమించారు. మూడు పార్లమెంట్ సీట్లకు అలాగే నాలుగు అసెంబ్లీ సీట్లకు ఇంచార్జిలను నియమించారు. ఈ జాబితాను సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ రిలీజ్ చేశారు.

ఈ జాబితాలో ఉన్న మేరకు మాజీ మంత్రి నెల్లూరుకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ ని నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయిస్తున్నారు. ఆయన నెల్లూరు అర్బన్ కి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రిగా మూడేళ్ల పాటు జగన్ క్యాబినెట్ లో చేశారు. ఈసారి ఆయనకు ఢిల్లీ దారి చూపించారు.

అదే విధంగా అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్ బాబుని మచిలీపట్నం పార్లమెంట్ కి ఇంచార్జిగా నియమించారు. దాంతో ఆయనకు పార్లమెంట్ దారి చూపించినట్లు అయింది. అయితే అవనిగడ్డకు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావుని ఇంచార్జిగా నియమించారు. అంటే ఆయన కుటుంబం నుంచే ఎమ్మెల్యే కోసం ఎంపిక చేశారు అనుకోవాలి.

ఇక అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జిని మార్చారు. నిన్నటిదాకా ఉన్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని మార్చి రేగం మత్స్య లింగానికి చాన్స్ ఇచ్చారు. ఆయన పక్కా లోకల్. పైగా ఎస్టీలలో బలమైన సామాజికవర్గానికి చెందిన వారు. దాంతో ఆయనకు అలా న్యాయం చేశారు. మరి మాధవిని ఎక్కడ ప్లేస్ ఇస్తారో చూడాలని అంటున్నారు.

కాకినాడ ఎంపీ సీటుకు ఇంచార్జిగా అందరూ ఊహించినట్లుగానే చలమలశెట్టి సునీల్ ని నియమించారు. ఆయన ఈ దఫాతో నాలుగవ సారి ఇదే సీటు నుంచి పోటీ చేయడం అవుతోంది. అలాగే 2014 తరువాత వైసీపీ నుంచి మళ్లీ రెండవ సారి పోటీ చేసినట్లు అవుతుంది అంటున్నారు.

సత్యవెడు అసెంబ్లీ ఇంచార్జిగా నూకతోటి రాజేష్ ని నియమించారు. తిరుపతి ఎంపీ అభ్యర్ధిగా మద్దిల గురుమూర్తిని నియమించారు. ఆయన ఇదే సీటుకు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే నాలుగవ జాబితాలో సత్యవేడుకి ఇంచార్జిగా ఆయన్ని నియమించారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలం తిరుపతి ఎంపీ ఇంచార్జిగా నియమిస్తే కాదని చెప్పి టీడీపీలోకి వెళ్ళిపోయారు. దాంతో యధాతధంగా ఆదిమూర్తిన మళ్లీ అక్కడ ఉంచారు. సత్యవేడుకు మాత్రం కొత్త వారికి చాన్స్ ఇచ్చారు. సో అదన్న మాట మ్యాటర్. అలా అతి చిన్న జాబితాను ప్రకటించినా అందులో లోతుగా ఆలోచిస్తే చాలానే విషయాలు ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News