భూమా ఫ్యామిలీని లాగేస్తున్న వైసీపీ...!

భూమా ఫ్యామిలీలో విభేదాలను సొమ్ము చేసుకుంటూ మరోసారి ఆళ్ళగడ్డలో వైసీపీ జెండా ఎగరేయాలని చూస్తోంది.

Update: 2024-03-02 01:30 GMT

వైసీపీ ఆపరేషన్ ఆళ్ళగడ్డ చేపట్టింది. అక్కడ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు టీడీపీ మరోసారి టికెట్ ఇచ్చింది. దాంతో ఆమెని ఓడించాలని వైసీపీ భారీ స్కెచ్ ని గీస్తోంది. భూమా ఫ్యామిలీలో విభేదాలను సొమ్ము చేసుకుంటూ మరోసారి ఆళ్ళగడ్డలో వైసీపీ జెండా ఎగరేయాలని చూస్తోంది.

ఇందులో భాగంగా భూమా కిషోర్ రెడ్డిని వైసీపీలోకి తీసుకుని వచ్చేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. భూమా కిషోర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆయన బీజేపీ నుంచి పోటీ చేయాలని గత నాలుగైదేళ్లుగా ఆళ్లగడ్డ చుట్టేశారు. ఆయన ప్రజలలో పలుకుబడిని పెంచుకున్నారు. ఆయన ఎవరో కాదు అఖిల ప్రియకు పెదనాన్న కుమారుడు. అఖిల ప్రియను తీవ్రంగా వ్యతిరేకించే కిషోర్ రెడ్డి కి షాక్ ఇచ్చేలా టీడీపీ ఆమెకే టికెట్ ఇచ్చింది.

దాంతో ఆమె ఓటమి కోసం కిషోర్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. ఆయన విషయం తెలుసుకుని వైసీపీ పిలిపించుకుని చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆయనతో వైసీపీ కీలక నేత సజ్జల రామక్రిష్ణారెడ్డి చర్చలు జరిపారు అని అంటున్నారు. వైసీపీలో చేరితే వచ్చే ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

అంతే కాదు 2029లో జరిగే నియోజకవర్గాల పునర్ విభజనలో ఆయనకు కొత్త సీటులో టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తామ్నిమరో హామీ ఇచ్చారని అంటున్నారు. దాంతో భూమా తన అనుచరులతో సమావేశం అయి నిర్ణయం ప్రకటిస్తారు అని అంటున్నారు. ఇక అఖిల ప్రియ మీద 2019 ఎన్నికల్లో 35 వేల ఓట్ల భారీ మెజారిటీతో బ్రిజేంద్ర గెలుపొందారు.

దాంతో మరోసారి అంతటి భారీ మెజారిటీని దక్కించుకోవడానికి వైసీపీ భూమా కిషోర్ రెడ్డిని కోరి పార్టీలోకి ఆహ్వానిస్తోంది అని అంటున్నారు. ఈ పరిణామం సహజంగానే టీడీపీలో కలవరం రేపుతోంది. అఖిలప్రియకు ఆళ్ళగడ్డ గెలుపు ఒక విధంగా సవాల్ గా మారిన నేపధ్యం ఉంది. ఇపుడు ఇద్దరు బలమైన ప్రత్యర్ధులు కలిస్తే ఓటమి కాదు భారీ తేడాతో పరాజయం తప్పదని అంటున్నారు. ఏపీలో వైసీపీ గెలిచే తొలి సీటు కూడా ఎన్నికలు లేకుండానే ఇదే అవుతుంది అని అపుడే లెక్క కడుతున్నారు.

Tags:    

Similar News