'ఇన్ సిగ్నిఫికెంట్'... మరో సారి జగన్ పై షర్మిల ఫైర్!
ఇదే సమయంలో... వైసీపీకి ప్రజలు ఓట్లు వేసింది.. ఇంట్లో కూర్చోవడానికి కాదని, సొంత మైకుల ముందు కాదని చెప్పిన షర్మిల.. అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడాలని సూచించారు.
వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంపై షర్మిల తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని.. బడ్జెట్ లో కేటాయింపులూ లేవని.. దీనిపై ప్రశ్నించాలని ఆమె వైసీపీని కోరుతున్నారు. దీనిపై స్పందించిన జగన్... 1.75% ఓట్లు ఉన్న పార్టీ, ఇన్ సిగ్నిఫెకెంట్ అంటూ కాంగ్రెస్ పార్టీపై కామెంట్లు చేశారు! దీనిపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు.
అవును... గత కొంతకాలంగా విషయం ఏదైనా... తన అన్న, వైసీపీ అధినేత జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు షర్మిల. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాలకు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంపై ఆమె కీలక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీకి వెళ్లని ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని కోరుతున్నారు. అయితే... కాంగ్రెస్ పార్టీ కి లైట్ తీసుకోవాలన్నట్లుగా జగన్ స్పందించారు.
ఇందులో భాగంగా... వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరు.. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉందంటూ మొదలుపెట్టారు. బడ్జెట్ బాగాలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కాని బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ, వైసీపీ కంటే ముందుగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినట్లు తెలిపారు. బడ్జెట్ పై తాము చెప్పిందే జగన్ చెప్పారని.. జగన్ కు 38% ఓట్లు వచ్చినా అసెంబ్లీకి వెళ్లనప్పుడు.. కాంగ్రెస్ కు వైసీపీకి తేడా ఏముందని అన్నారు.
ఈ నేపథ్యంలోనే... 38 శాతం ఓట్ షేర్ పెట్టుకొని కూడా అసెంబ్లీకి వెళ్లలేని వైసీపీ నిజానికి ఒక "ఇన్ సిగ్నిఫికెంట్" పార్టీగా మారిచింది జగన్ అంటూ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా... అసెంబ్లీలో అడుగుపెట్టలేని, ప్రజా సమస్యల కోసం సభల్లో పట్టుబట్టలేని, పాలకపక్షాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేని, అసమర్థ వైసీపీ ఇవాల రాష్ట్రంలో అసలైన "ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ" అంటూ షర్మిల నిప్పులు కురిపించారు.
ఇదే సమయంలో... వైసీపీకి ప్రజలు ఓట్లు వేసింది.. ఇంట్లో కూర్చోవడానికి కాదని, సొంత మైకుల ముందు కాదని చెప్పిన షర్మిల.. అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడాలని సూచించారు. అదేవిధంగా... చిత్తశుద్ధి ఉంటే.. నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లెలా చేయాలని.. ప్రతిపక్షం కాకపోయినప్పటికీ.. 11 మంది ప్రజాపక్షం అనిపించుకోవాలని తెలిపారు.
దే క్రమంలో... ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్లే ధమ్ము లేకపోతే రాజీనామాలు చేయాలని.. ఎన్నికలకు వెళ్లాలని.. అప్పుడు ఎవరు ఇన్ సిగ్నిఫికెంట్ అనేది తేలుతుందంటూ షర్మిల చెప్పుకొచ్చారు. లేదంటే... అసెంబ్లీ వెళ్లి చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ సూపర్ సిక్స్ పథకాలపై నిధుల కేటాయింపులపై నిలదీయాలని సూచించారు.