యువగళానికి ఎండ్ కార్డ్...పెద్ద ప్లాన్ లో చినబాబు ...!
తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ఎండ్ కార్డు చాలా వేగంగానే పడుతోంది.
తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ఎండ్ కార్డు చాలా వేగంగానే పడుతోంది. నిజానికి కుప్పం టూ ఇచ్చాపురం అని ఈ యాత్ర షెడ్యూల్ ప్రకటించారు. మొత్తం నాలుగు వేల కిలోమీటర్లు సుదీర్ఘంగా సాగాలి. అయితే పాదయాత్రకు మధ్యలో ఒక తొంబై రోజులు బ్రేక్ వచ్చిపడింది.
చంద్రబాబు అరెస్ట్ తో యాత్ర అలా స్టాప్ అయింది. తిరిగి దాన్ని గత నెల 27 నుంచి లోకేష్ ప్రారంభించారు. పట్టుమని నెల రోజులు కూడా చేయకుండా ఈ నెల 17 నాటికి ముగించేస్తున్నారు. అది కూడా భీమునిపట్నంలో భారీ సభ పెట్టేసి ఎండ్ కార్డ్ వేసేస్తున్నారు. మరి నాలుగు వేల కిలోమీటర్లు ఇచ్చాపురం మాట ఏంటి అంటే ఈ యాత్ర రీ షెయ్డూల్ లో అవి లేవు అని అంటున్నారు.
ఎందుకంటే ఎన్నికలు ఒక లెక్కన ముంచుకొస్తున్నాయి. జనవరరి వచ్చిందంటే చాలు ఆ వేడి ఒక లెవెల్ లో ఉంటుంది. ప్రచారానికి టైం సరిపోదు. అదే విధంగా మొత్తం ఏపీ వ్యాప్తంగా అభ్యర్ధుల ఎంపికలో తండ్రి చంద్రబాబుకు లోకేష్ సహాయకారిగా ఉంటారని అంటున్నారు.
అదే విధంగా టికెట్ రానివారు ఉన్నా లేక పొత్తులలో టికెట్ పోయినా వారి అందరికీ నచ్చచెప్పి మరీ దారికి తేవాలి. ఏపీవ్యాప్తంగా తండ్రితో పాటు ప్రచారం చేయాలి. జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణను కూడా జనంలోకి తీసుకుని పోవాలి.
ఇలా అనేక కారణాలు ఉండడంతోనే పాదయాత్రకు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు అని అంటున్నారు. ఇక భీమునిపట్నంలో ఈ నెల 17న పాదయాత్ర ముగింపుని మాత్రం అతి పెద్ద స్థాయిలో నిర్వహించాలని చూస్తున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఈ ముగింపునకు అటెండ్ అవుతున్నారు. అంతే కాదు ఈ క్లోజింగ్ ఫంక్షన్ మాత్రం ఉత్తరాంధ్రా ఊపేసేలా చేయాలని చూస్తున్నారు
ఏది ఏమైనా లోకేష్ బాబు విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు టచ్ చేయకుండా పాదయాత్ర ముగించడం క్యాడర్ లో కొంత అసంతృప్తిగా ఉంది అంటున్నారు. అదే విధంగా జనవరి దకా పాదయాత్ర కంటిన్యూ చేస్తే బాగుండేది అన్న భావన కూడా ఉందిట. ఎందుకంటే పాదయాత్ర ద్వారా తమ నియోజకవర్గాలలో లోకేష్ వెళ్తే ఏమైనా పొలిటికల్ గా మేలు జరుగుతుందని తమ్ముళ్ళు భావిస్తున్నారు.
అంతే కాదు టికెట్ల విషయం కూడా చెప్పుకునేందుకు ఇదొక చాన్స్ అని కూడా అనుకుంటున్నారు. కానీ లోకేష్ మాత్రం భీమిలీ వద్దనే యువగళానికి గేట్ వేసేశారు. మరి ఇదంతా చంద్రబాబు వ్యూహంలో భాగమే అంటున్నారు. ఏది ఏమైనా యువగళం తరువాత బాబు బాగా బిజీ అవుతారు అని అంటున్నారు. చూడాలి మరి లోకేష్ పాదయాత్ర తరువాత తీసుకునే ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయో.