విదేశీ విద్యార్థుల "ఫుడ్" పై కొట్టిన కెనడా... భారతీయులకు ఎఫెక్ట్ ఎంత?
భారతదేశం విషయంలో గత కొంతకాలంగా కెనడా అనుసరిస్తోన్న వైఖరి, చేస్తోన్న ఆధారాలు లేని ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.
భారతదేశం విషయంలో గత కొంతకాలంగా కెనడా అనుసరిస్తోన్న వైఖరి, చేస్తోన్న ఆధారాలు లేని ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇరు దేశాల మధ్య దౌత్యపరంగా గతంలో ఎప్పుడూ లేనంత అగాధం ఏర్పడిందని అంటున్నారు. ఈ సమయంలో అక్కడి ప్రభుత్వం విద్యార్థుల విషయంలో వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
అవును... భారతదేశం విషయంలో ఇప్పటికే వివాదాస్పద వైఖరితో ముందుకు సాగుతున్న కెనడా.. ఇప్పుడు విదేశీ విద్యార్థుల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా. విదేశీ విద్యార్థుల ఫుడ్ బ్యాంక్ ల సేవలపైనా కోత పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో.. ఇప్పుడు ఈ విషయం తీవ్ర వివాదాస్పదమవుతోంది.
ఇప్పటికే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను పరిమితం చేస్తున్న ట్రూడో సర్కార్... విదేశీ విద్యార్థుల ఫుడ్ బ్యాంక్ ల సేవలపైనా కోత పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... మొదటి ఏడాది విద్యార్థులకు ఈ సౌలభ్యం కల్పించకూడదని వాంకోవర్ లోని ఫుడ్ బ్యాంక్ నిర్ణయించిందని తెలుస్తోంది. దీనిపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
ఈ తాజా నిర్ణయం భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై స్పందించిన కెనడా ఫుడ్ బ్యాంక్స్ సీఈవో కిర్ స్టిన్ బియర్డ్ స్లీ... అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఖర్చులు వంటివాటితో తాము తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నామని చెప్పుకొచ్చారు. ఇలా తీసుకున్న తాజా నిర్ణయాన్ని ది గ్రేటర్ వాంకోవర్ ఫుడ్ బ్యాంక్ సమర్ధించుకుంటోంది.
కాగా.. ఫుడ్ బ్యాంక్ అనేది విదేశీ విద్యార్థులకు చాలా ప్రయోజనకారి అని అంటారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఈ ఏడాది మార్చిలో సుమారు 20 లక్షల మంది ఈ ఫుడ్ బ్యాంకులను ఆశ్రయించారంటే.. పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 6 శాతం పెరిగిందని, ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఏకంగా రెట్టింపయ్యిందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయ విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నిర్ణయం దారుణమని ఆందోళన వక్తం చేస్తున్నారు!