ఒమిక్రాన్ ఇప్పుడు ప్రంపంచాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి కంటే ఒమిక్రాన్ ఐదురెట్లు ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వేరియంట్ మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు అన్ని దేశాలూ అంతర్జాతీయ ప్రయాణాలపై గట్టి ఆంక్షలు విధించారు.
ప్రధానంగా ఒమిక్రాన్ పుట్టిన సౌతాఫ్రికా, అది వ్యాపించిన ఇతర దేశల నుంచి వచ్చే ప్రయాణికులపై దేశంలోని అన్ని విమానాశ్రాయాల్లో గట్టి నిఘా పెట్టారు. ఇతర దేశాల నుంచి వస్తున్న వారి లిస్టు పరిశీలించి అనుమానితును 14 రోజులు క్వారంటైన్ లో ఉంచుతున్నారు.
దక్షిణాఫ్రికా జాతీయుడైన 66 ఏళ్ల వ్యక్తి భారత్ లో తొలి ఒమిక్రాన్ కేసుగా గుర్తించారు. అతను దుబాయ్ మీదుగా ఇండియాకు వచ్చాడు. కొవిడ్ నెగెటివ్ ధ్రువపత్రంతో బెంగళూరుకు వచ్చిన అతడికి అదే రోజు పరీక్ష చేశారు. అయితే అతడికి పాజిటివ్ గా నిర్ధారించారు. ఐసొలేట్ కావాలని ప్రభుత్వ వైద్యుడు సూచించారు.
అయితే నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా అతను క్యాబ్ బుక్ చేసుకుని దుబాయ్ వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. అంతేకాదు తన ప్రయాణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఓ ప్రైవేటు ల్యాబ్ నుంచి కొవిడ్ నెగెటివ్ రిపోర్టు కూడా తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. అతడిని కలిసి వారందరికీ పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
దక్షిణాఫ్రికా జాతీయుడు ప్రైవేటు ల్యాబ్ ద్వారా నెగటివ్ రిపోర్టు ఎలా సంపాదించాడు? ఈ రిపోర్టులో ఏమైనా అవకతవకలున్నాయా? క్యారంటైన్ సెంటర్ లో ఉన్న రోగి ఎలా తప్పించుకోలగలిగాడు అనే కోణాల్లో విచారణ జరపాలని కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు పోలీస్ కమిషనర్ ను ఆదేశించారు. సౌతాఫ్రికా నుంచి కర్ణాటకకు వచ్చిన మరో 10 మంది ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేసి, ఆచూకీ తెలియకుండా తిరుగుతున్నారు.
వారి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్రం హుటాహుటిన కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైను ఢిల్లీకి పిలిపించింది.
యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని బొమ్మైకు సూచించినట్లు తెలుస్తోంది. బెంగళూరులో కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తీవ్ర ఆంక్షలు విధించాలని పరిశీలిస్తున్నారు. పరిస్ధితులు మళ్లీ లాక్‌డౌన్ దిశలో సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక, విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మరొకరికి కూడా పాజిటివ్ వచ్చింది. అది ఏ వేరియంట్ అనేది తేలాల్సి ఉంది.
ఒమిక్రాన్‌తో వణుకుతున్న దక్షిణాఫ్రికాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందాన్ని పంపింది. వేరియంట్ కేంద్ర స్థానం గౌటెంగ్ ప్రావిన్స్‌లో ఈ బృందం పర్యటించనుంది. ఇప్పటికే ఓ బృందం ఒమిక్రాన్ వేరియంట్ జన్యు విశ్లేషణలో దక్షిణాఫ్రికాకు సాయపడుతోంది. దక్షిణాఫ్రికాలో గత వారం నుంచి నమోదవుతున్న కేసుల్లో అధిక కేసులు గౌటెంగ్‌లోనే నమోదయ్యాయని చెబుతున్నారు.