కరోనా వైరస్ కట్టడి కోసం భారతదేశంలో విధించిన లాక్ డౌన్ తో కొంత ఆ వైరస్ అదుపులోకి వచ్చిన సమయంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారితో ఒక్కసారిగా దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాపోయాయి. మూడంకెలకు పరిమితమైన కరోనా కేసులు వారి వలన ఒక్కసారిగా వేలకు చేరాయి. ఆ ప్రార్థనలకు వెళ్లిన వారికి వైరస్ సోకగా వారు నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లల్లోనే ఉన్నారు. దీంతో వారి ద్వారా మరికొంతమందికి కరోనా పాకించారు. దీంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే ఆ ఢిల్లీకి వెళ్లిన వారి వలన చాలామందికి కరోనా వైరస్ వ్యాపిస్తోంది. తాజాగా వారి వలన ఏకంగా 10 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
విధి నిర్వహణలో ఉన్న పది మంది పోలీసులకు కరోనా వైరస్ సోకినట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర రాజధాని భోపాల్ లోని తబ్లిగ్ జమాత్ సభ్యుల ద్వారా కరోనా వైరస్ పోలీసులకు సోకిందని అధికారులు తెలిపారు. ఇటీవల భోపాల్ లోని మసీదుల్లో తబ్లిగ్ జమాత్ సభ్యులు దాక్కోవడంతో వారిని పోలీసులు వెతికి పట్టుకున్నారు. వారిని క్వారంటైన్ కు తరలించారు. అయితే ఆ సమయంలో విధులు నిర్వహించిన పోలీసులకు కరోనా వైరస్ వ్యాపించింది. కరోనా పాజిటివ్ సోకిన వారిలో భోపాల్ సిటీ పోలీస్ సూపరింటెండెంట్ తోపాటు ఓ సబ్ ఇన్ స్పెక్టర్ - 8 మంది కానిస్టేబుళ్లకు కరోనా వైరస్ సోకిందని పరీక్షల్లో తేలింది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన తబ్లిగ్ జమాత్ సభ్యుల కోసం పోలీసులు గాలించారని - వారి ద్వారానే కరోనా సోకి ఉంటుందని భోపాల్ పోలీసు ఐజీ ఉపేంద్ర జైన్ ప్రకటించారు. భోపాల్ లోని ఐష్ బాగ్ - జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్ లకు చెందిన వారికే కరోనా సోకిందని వివరించారు.
మొత్తం 32 మంది జమాత్ సభ్యులు - ఏడుగురు విదేశీయులను పట్టుకుని క్వారంటైన్ తరలించారు. ఈ సమయంలోనే వారికి వైరస్ వ్యాపించింది. అయితే పోలీసులకు కరోనా వైరస్ సోకడంతో పోలీస్ వాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలో అన్ని పోలీస్ స్టేషన్ లను శానిటైజ్ చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు వారిని అరెస్ట్ చేయడం.. క్వారంటైన్ కు తరలించే క్రమంలో విధుల్లో పాల్గొన్న వెయ్యిమంది పోలీసులను హోటళ్లకు తరలించారు. అయితే రాష్ట్రంలో మరికొందరు మర్కజ్ కు వెళ్లి వచ్చిన జమాత్ సభ్యులు ఉన్నారని.. వారు వెంటనే ఆస్పత్రుల్లో చేరకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. వారి వలన వైరస్ వ్యాపిస్తుండడంతో జమాత్ సభ్యులను గుర్తించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే పోలీసులకు కరోనా వ్యాప్తి చెందకుండా పోలీస్ శాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.