హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటు చేసుకుంది. కశ్మీర్ రాష్ట్రానికి చెందిన యువతిని కొందరు దారుణంగా వంచించటమే కాదు.. 20 రోజుల పాటు నరకం చూపించిన వైనం సంచలనంగా మారింది. రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి.. బొటిక్ తెరవాలన్న ఉత్సాహాన్ని అసరా చేసుకొని.. గదిలో బంధించి మరీ 20 రోజుల పాటు గ్యాంగ్ రేప్ చేసిన వైనం ఆలస్యంగా బయటకు వచ్చింది.
గత ఏడాది డిసెంబరులో కశ్మీర్ కు చెందిన యువతి హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీలో స్థిరపడిన ఆమె బొటిక్ ఏర్పాటు చేసుకొన్నారు. హైదరాబాద్ లోనూ బొటిక్ ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఫరీద్ అనే యువకుడు పరిచయమయ్యాడు. అతన్ని నమ్మి.. బొటిక్ దుకాణాల్ని చూసేందుకు అతడితో వెళ్లింది.
బొటిక్ కోసం షాపులు చూపించే మిష మీద ఆమెను జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 36లో ఒక గదిలో ఆమెను బంధించారు.
తనతో పాటు మరో ముగ్గురితో కలిపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదే తీరులో 20 రోజుల పాటు నరకాన్ని చూపించారు. రూంలో బంధించిన ఆమె.. ఎట్టకేలకు తప్పించుకొని ఢిల్లీకి చేరుకున్నారు. తనకు జరిగిన విషయాన్ని తల్లికి చెప్పారు. దీంతో న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కారు. ఢిల్లీ హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు.
కోర్టు ఆదేశాలతో ఎఫ్ ఐఆర్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు ఘటన జరిగిన హైదరాబాద్ కు ఈ కేసును బదిలీ చేశారు. బాధిత యువతి పేర్కొన్న రీతిలో.. ఆమెపై దారుణానికి పాల్పడిన నిందితుల్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.