ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 9628 మందికి పరీక్షలు నిర్వహించగా.. 48 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తాజాగా బులిటెన్ విడుదల చేసింది. దీంతో ఏపీ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2205కి చేరింది.
ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 9, గుంటూరు జిల్లాలో 9, కర్నూలు జిల్లాలో 9 కేసులు ఉన్నాయి.
ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 49కి చేరింది. వివిధ ఆసుపత్రుల్లో కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1353. ప్రస్తుతం కరోనా ఆస్పత్రుల్లో 803మంది చికిత్స పొందుతున్నారు.
కాగా ఈరోజు కరోనా పాజిటివ్ వచ్చిన వారంతా తమిళనాడు చెన్నై కోయంబేడ్ మార్కెట్ నుంచి వచ్చిన వారేనని అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఏపీలో నమోదైన కేసుల సంఖ్య 150 అని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.