ఏపీలో ‌తాజాగా 68 పాజిటివ్, ఒక మ‌ర‌ణం

Update: 2020-05-20 07:50 GMT
మ‌హ‌మ్మారి వైర‌స్ విజృంభ‌ణ ఎక్క‌డా త‌గ్గడం లేదు. కేసుల సంఖ్య రోజువారీగా పెరుగుతూనే ఉంది త‌ప్ప త‌గ్గ‌డం లేదు. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెండున్న‌ర వేల‌కు చేరువ‌లో పాజిటివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 68 కేసులు న‌మోద‌య్యాయి. బుధ‌వారం  రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఆ బులెటిన్‌లో  24 గంటల్లో 9,159 న‌మూనాలు పరీక్షించగా 68 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారని ప్ర‌క‌టించింది. ఒక‌రు క‌ర్నూలు జిల్లాలో మ‌ర‌ణించారు. అయితే 43 మంది ఆ వైర‌స్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని వెల్ల‌డించింది.

తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం 2,407కు పాజిటివ్ కేసులు చేరాయి. డిశ్చార్జ్‌లు 1,639 మంది ఉండ‌గా, మృతి చెందిన వారి సంఖ్య 53‌. ప్రస్తుతం వైర‌స్ యాక్టివ్‌గా ఉండి చికిత్స పొందుతున్నవారి సంఖ్య 715. ఇవ‌న్నీ బాగానే ఉన్నా రెండు రోజులుగా ఎక్క‌డ కేసులు న‌మోద‌వుతున్నాయ‌నే విష‌యం ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌డం లేదు. ఎందుకంటే రెండు రోజుల నుంచి జిల్లాల వారీగా లెక్కలను విడుదల చేయడం లేదు. ఏ జిల్లాలో ఎన్ని కేసులు నమోదయ్యాయని తెలియ‌డం లేదు. ఈ విషయంలో ఎందుకు గోప్యత పాటిస్తున్నారో అర్థం కావ‌డం లేదు.
Tags:    

Similar News