చిన్నారులు.. బలహీనులు.. అబలలు.. అన్న తేడా లేకుండా ఆకృత్యాలు సాగించే ఐసిస్ ఉగ్రవాదులు ఒక వైపు... వారిని అంతమొందించాలన్న పట్టుదలతో ప్రభుత్వాలు, అంతర్జాతీయ సమాజం మరో వైపు.. రెండింటి మధ్య భీకర యుద్ధం ఇప్పుడు సిరియాలోని అలెప్పో నగరాన్ని ఛిద్రం చేస్తోంది. అక్కడి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. నిత్యం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు ప్రభుత్వ బలగాలకు మధ్య జరుగుతున్న యుద్ధంతో ఏ క్షణాన్న ఏ ఇంటి మీద బాంబు పడుతుందో తెలియని పరిస్థితి. ఎవరి ప్రాణాలు ఎప్పుడు గాల్లో కలుస్తాయో తెలియని దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ చిన్నారి ప్రజల కష్టాన్ని అర్థం చేసుకోవాలంటూ చేస్తున్న ట్వీట్లు అందరినీ కదిలిస్తున్నాయి. ప్రభుత్వం, ఉగ్రవాదులు ఇద్దరు దాడులు ఆపేసి శాంతి నెలకొల్పాలని కోరుతోంది. అలెప్పో ప్రజలు ప్రశాంతంగా బతికే పరిస్థితులు కల్పించాలని కోరుతోంది.
ఏడేళ్ల వయసున్న బనా అలబెడ్ అనే చిన్నారి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తున్న చిత్రాలు, అంశాలు యుద్ధోన్మాదులను తప్ప అందరినీ కదిలిస్తున్నాయి. ట్విట్టర్ ద్వారా ఆ చిన్నారి చెబుతున్న మాటలు - వివరాలు వింటుంటే ఎవరికైనా జాలి కలగాల్సిందే. 'అమాయకులైన మాపై ఎందుకు బాంబులు వేస్తున్నారు' అంటూ విషాదంతో చూస్తున్నట్లుగా ఆమె పోస్ట్ చేసిన చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్. 'ఫ్రెండ్స్ ఇది జాబిలి కాదు.. మా నగరంపై బాంబు దూసుకొస్తుంది' అంటూ ఓ బాంబు అలెప్పోపై పడుతున్న ఛాయా చిత్రాన్ని పెట్టింది. రాత్రంతా బాంబుల వర్షం కురిసిన ప్రాంతంలో ఆమె తిరుగుతూ 'అలెప్పోకు గుడ్ మార్నింగ్... మేం ఇంకా బతికే ఉన్నాం అంటూ ఆమె పెట్టిన వీడియో చూసి మనసు చలించని వారే లేరు.
'రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. ఎందుకంటే నా మిత్రురాలు బాంబు దాడిలో చనిపోయింది. నేను ఏడుపు అపలేకపోతున్నాను'. 'ఎవరైనా దయచేసి నన్ను రక్షించరా ప్లీజ్ అంటూ తన బెడ్ వెనుకాల దాచుకున్నట్లుగా ఉన్న ఓ వీడియో అయితే గుండెలు పిండేస్తోంది. ఇలా ప్రతిరోజు అలెప్పోలోని పరిస్థితులు ప్రపంచానికి అర్థమయ్యేలా ఈ చిన్నారి తన ఖాతాలో వివరిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. మరి.. ఆ చిన్నారి ఆవేదన ఎప్పుడు తీరుతుందో... అలెప్పో ఎప్పుడు శాంతియుతంగా మారుతుందో ఆ దేవుడికే తెలియాలి.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/