తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఇప్పటివరకు 743మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. 743మందికి దాదాపు 400 మంది మహమ్మారిని జయించి నగరంలోని పలు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని వెల్లడించారు. కరోనా కేంద్రాల్లో 338మంది చికిత్స పొందుతున్నారని వివరించారు. కరోనాతో ఇప్పటివరకు ఐదుగురు టీటీడీ ఉద్యోగులు మృతి చెందారని వివరించారు.
ఇక టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.3200 కోట్లు కాగా.. ఇందులో రూ.1350 కోట్లు కేవలం జీతాలకే ఖర్చు అవుతుందని.. ప్రస్తుతం నెలకు రూ. 150-200కోట్ల వరకు ఖర్చు అవుతోందని ఈవో వెల్లడించారు. కార్పస్ ఫండ్ నుంచి ఎలాంటి నిధులు తీసుకోవడం లేదని ఈవో తెలిపారు.గత నెల హుండీ ఆదాయం రూ.16కోట్లు వచ్చినట్టు తెలిపారు. ఈ-హుండీ ద్వారా 3 కోట్లు వచ్చిందన్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలా.? భక్తులను అనుమతించాలా అనే విషయం కేంద్రం అన్ లాక్ మార్గదర్శకాలను బట్టి నిర్ణయిస్తామని ఈవో తెలిపారు. అర్చకులను ఇబ్బందులకు గురిచేసి దర్శనాలు చేయించాలనే ఆలోచన టీటీడీకి లేదని ఈవో స్పష్టం చేశారు.