టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇళ్లు, కార్యాలయాలపై ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు శుక్రవారం దాడులు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, గుంటూరులోని ఆయన నివాసం, కార్యాలయాల్లో ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించాయి. ఈ సమయంలో రాయపాటి ఇంట్లోనే ఉన్నట్టు సమాచారం.
ఈ సోదాల్లో ఐదుగురు సీబీఐ అధికారులు, నలుగురు కెనరా బ్యాంకు అధికారులు పాల్గొన్నట్టు తెలిసింది. కాగా రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్థ ఏకంగా రూ.7926.01 కోట్లు మోసానికి పాల్పడిందని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.
పోలవరం సహా పలు ప్రాజెక్టులు చేపట్టిన రాయపాటి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రుణాల కోసం పలు బ్యాంకులను సంప్రదించింది. కెనరా బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం ఈ రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీనికి కెనరా బ్యాంకు నేతృత్వం వహించింది. అనంతరం ఈ బ్యాంకు నిధులను తప్పుడు మార్గం మళ్లించారని.. ఫలితంగా తమకు రూ.7926.01 కోట్లు నష్టం వాటిల్లినట్లు కెనరా బ్యాంకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఫిర్యాదు చేసింది.
క్రెడిట్ లిమిట్స్ నుంచి రూ.264 కోట్లను పలు దఫాల్లో వేరే ఖాతాలకు ట్రాన్స్ టాయ్ మళ్లించిందని బ్యాంకులు ఆరోపిస్తున్నాయి. తమ వద్ద తీసుకున్న రుణాన్ని ఉద్దేశపూర్వకంగా వేరే ఖాతాలకు మళ్లించారంటూ హైదరాబాద్ లోని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు సీబీఐ 2019 డిసెంబర్ 30న కేసు నమోదు చేసింది. రాయపాటి సాంబశివరావు, చెరుకూరి శ్రీధర్, కంపెనీకి చెందిన డైరెక్టర్ శ్రీనివాస బాబ్జి , గుర్తు తెలియని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులనూ సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్చింది.