అక్రమ సంబంధాలు దారితప్పుతున్నాయి. ఎఫైర్ల మాటున దారుణాలు జరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. దీంతో దేశంలో స్త్రీలకు రక్షణ లేకుండా పోతున్నాయి. మధ్యప్రదేశ్ లో ఇటీవల అత్యాచారాల కేసులు పెరగడం కలకలం రేపుతోంది.
మధ్యప్రదేశ్ లో ఒక దారుణ ఘటన వెలుగుచూసింది. రాష్ట్రంలోని జబల్పూర్ నగరంలో ఇద్దరు అక్కా చెల్లెల్ల పై ఒకే వ్యక్తి అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది.. అందులో అక్క మేజర్ కాగా.. చెల్లెలు మైనర్ బాలిక కావడం గమనార్హం. నిందితుడు ప్రతాప్ త్రీ స్టార్ హోటల్ లో కారు డ్రైవర్ గా పనిచేస్తున్నారు.
అదే హోటల్ లో పనిచేసే ఒక యువతి ఈ కారు డ్రైవర్ తో పరిచయం ఏర్పడింది. ఆమె నర్సింగ్ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేస్తోంది. ఒకరోజు కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి ఆ యువతిని ప్రతాప్ రేప్ చేశాడు. ఇదంతా వీడియో తీసి పెట్టుకున్నాడు. ఇంటర్నెట్ లో పెడుతానంటూ నాలుగేళ్లుగా యువతి పై అత్యాచారం చేస్తూనే ఉన్నాడు.
ఇటీవల యువతి చెల్లెలు 17 ఏళ్ల మైనర్ బాలిక చదువుకునేందుకు అక్క వద్దకు వచ్చింది. ఆమె పై కన్నేసిన ప్రతాప్ ఎలాగైనా అనుభవించాలని స్కెచ్ వేశాడు. ఓ రోజు అక్కకు తెలియకుండా కారులో చెల్లెలిని తీసుకొని షికారుకు బయలు దేరాడు. అక్కడ కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. సృహ కోల్పోయిన బాలిక పై అత్యాచారం చేశాడు. ఇక్కడ కూడా మళ్లీ వీడియో తీశాడు..
జరిగిన దారుణం పై అక్కకు చెల్లె చెప్పి వాపోయింది. ఈ వీడియోలు చూపించి ప్రతాప్ బెదిరిస్తూ కోరిక తీర్చాలని పట్టుబట్టడంతో మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రెండు వేర్వేరు రేప్ కేసులు పెట్టారు. మైనర్ బాలిక పై రేప్ కావడం తో పోక్సో చట్టం కింద కేసు పెట్టి ప్రతాప్ ను అరెస్ట్ చేయడానికి వెళ్లగా పారిపోయాడు.