ఇవాల్టి.. రేపటి రోజున అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు.. వారి సంతానం వివాదాలు.. ఆరోపణల్లో చిక్కకుపోవటమే తప్పించి.. ఒక మంచి పని చేసి స్ఫూర్తిదాతగా నిలుస్తున్నది లేదు. నిత్యం ఏదో ఒక తలనొప్పి వ్యవహారంతో తలంటు పోయించుకోవటం ఒక అలవాటుగా మారింది. దీనికి భిన్నంగా తాజాగా దేశ ప్రధమ పౌరుడు కుమారుడు రియల్ హీరోలా వ్యవహరించి అందరి మనసుల్ని దోచుకుంటున్నాడు.
రాష్ట్రపతి ప్రణబ్ దా కుమారుడు అభిజిత్ ముఖర్జీ చేసిన పనిని ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు. అత్యున్నత స్థానాల్లో ఉండేవారి పుత్రరత్నాలు ఎలా ఉండ కూడదో ఇప్పటివరకూ చూసిన వారికి.. ఎలా ఉండాలన్నదానికి అభిజిత్ ముఖర్జీ ఇప్పుడో ఉదాహరణగా మారారని చెప్పొచ్చు.
ఇంతకీ.. ఆయన చేసిన అంత గొప్ప పనేమిటంటే.. ఒక రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న ఒక మహిళను కాపాడారు. మానవత్వంతో స్పందించి.. మెరుగైన వైద్యం కోసం మంచి ఆసుపత్రికి తరలించి వైద్యం జరిగేలా చేశారు. ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటనలో సుమితాపాల్ అనే మహిళ తన కుమారుడు అర్ఘ్యతో కలిసి బురద్వాన్ నుంచి గస్కరాలోని ఆలయానికి వెళుతుండగా ఒక ప్రమాదానికి గురయ్యారు.సుమితాపాల్ కిందకు పడిపోవటం.. తలకు బలమైన గాయం తగలటంతో ఆమెకుమారుడు అర్ఘ్యకు ఏం చేయాలో తోచలేదు.
ఈ సమయంలో అదే దారిలో వెళుతున్న అభిజిత్ విషయం తెలుసుకొని.. తన కారులో సుమితాపాల్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బురద్వాన్ మెడికల్ కాలేజి ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి డాక్టర్లు చెప్పటంతో.. అందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయించిన ఆయన.. కలెక్టర్ తో మాట్లాడి ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రధమపౌరుడి కుమారుడు చెప్పిన మాటను వెంటనే అమలు చేసిన కలెక్టర్ సదరు మహిళకు మెరుగైన వైద్యం అందేలా చేశారు. ఈ సమయంలో తల్లి పక్కనే ఉన్న అర్ఘ్యకు కొంత డబ్బు అందజేసి.. జాగ్రత్తలు చెప్పారు.
ఈ విషయం బయటకు రావటం.. పలువురు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీనికి స్పందించిన ఆయన.. తానేం గొప్ప పని చేయలేదని.. సాటి మనిషిగా సాయం చేశానంతే అంటూ చెప్పి మరింతగా మనసు దోచుకుంటున్నారు. ఇక్కడ మరో విషయం చెప్పాలి. అభిజిత్ ముఖర్జీ రాష్ట్రపతి ప్రణబ్ దా కుమారుడు మాత్రమేకాదు.. ముర్షిదాబాద్ లోని జంగీపూర్ లోక్‌సభా స్థానానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కూడా. ఇలాంటి నాయకులు అన్నిచోట్ల ఉంటే ఎంత బాగుండు.