శ్రీకాకుళం జిల్లాలో చూస్తే ఇద్దరు సీనియర్ నేతలు టీడీపీలో ఉన్నారు. వారి మధ్య ఆధిపత్య పోరు అలా దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. అది దివంగత నేత ఎర్రనాయుడు నుంచే మొదలైంది. ఇపుడు అచ్చెన్నాయుడు రూపంలో కూడా అలాగే సాగుతోంది. ఇక ఏపీ టీడీపీకి ఫస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ కళా వెంకటరావు అయ్యారు. ఆయన చంద్రబాబుకూ లోకేష్ బాబుకు బాగా దగ్గరవారుగా ఉన్నారు.
ఇక అచ్చెన్నాయుడు అంటే బాబుకు బాగా ఇష్టం ఉండేది. అయితే గత ఏడాది తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సందర్భంగా అచ్చెన్నాయుడు ఒక హొటల్ లో పార్టీ మీద కొన్ని చేయకూడని కామెంట్స్ చేశారంటూ వీడియో ఒకటి బయటకు వచ్చింది. అయితే అది తన వాయిస్ కాదని, తాను అలా అనలేదని అచ్చెన్నాయుడు ఎంత అన్నా కూడా అసలు విషయం అందరికీ తెలుసు కాబట్టి నాటి నుంచి బాబు ఆయనకు ప్రాధాన్యత కొంత తగ్గించేశారు.
ఇక లోకేష్ మీద అచ్చెన్న నాడు చేసిన కొన్ని కామెంట్స్ వల్ల చినబాబు కూడా ఆయన విషయంలో దూరం మెయింటెయిన్ చేస్తున్నారు అని చెబుతారు. ఈ మధ్య శ్రీకాకుళం టూర్ కి వచ్చిన లోకేష్ బాబు రాజాం వెళ్ళి కళా వెంకటరావు ఇంట్లో కూర్చున్నారు. అక్కడే ఆయన మొత్తం పార్టీకి చెందిన నాయకులను అందరినీ రప్పించుకుని మీటింగ్ పెట్టారు.
ఆ విధంగా కళా వెంకటరావుకు లోకేష్ విశేష ప్రాధాన్యత ఇచ్చారు. ఇక ఆయన టీడీపీలోకి తీసుకువచ్చిన మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహన్ రావును కూడా లోకేష్ బాగా ప్రోత్సహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కళా తనకు కానీ కుమారుడికి కానీ ఎచ్చెర్ల టికెట్ కోరుకుంటున్నారు. అలాగే రాజాం సీట్లో తన మాట నెగ్గాలని అనుకుంటున్నారు. దానికి లోకేష్ వైపు నుంచి చూస్తే ఓకే అన్న మాట వినిపిస్తోంది అంటున్నారు.
అయితే ఇక్కడ అచ్చెన్నాయుడు కళాకు యాంటీగా తన వారు అనుకున్న వారిని పోటీకి దింపారు. ఎచ్చర్లలో కలిశెట్టి అప్పలనాయుడుని పోటీ చేయించాలనుకుంటున్నారు. అలాగే రాజాం లో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మకు టికెట్ ఇప్పించాలని చూస్తున్నారు. అయితే లోకేష్ వచ్చిన సందర్భంగా కోండ్రు మురళీమోహనరావు అతి పెద్ద రోడ్ షోను రాజాంలో నిర్వహించి చినబాబు మెప్పుకోలు పొందేశారు.
ఇక కళా ఇంట్లోనే చినబాబు మకాం పెట్టడంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు అంతా కళాను ఇపుడు టిక్కెట్ల కొరకు ఆశ్రయిస్తున్నారుట. మొత్తానికి ఇన్నాళ్ళూ అచ్చెన్న దూకుడుతో ఇబ్బంది పడిన కళా శిబిరంలో ఇపుడు కొత్త కాంతులు వచ్చాయని అనుచరులు సంబరపడుతున్నారు. మరి ఆ విధంగా అచ్చెన్న మీద కళా పై చేయి సాధించినట్లేనా. చూడాలి మరి.