టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తిరుపతి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తన అంతరంగికులతో కులాసాగా మాట్లాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఓ టీడీపీ నేతతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడిన వీడియో చక్కర్లు కొడుతోంది.ఈ అంతరంగిక సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్లను అచ్చెన్నాయుడు ప్రస్తావిస్తున్నట్టు వీడియోలు వైరల్ అయ్యాయి.
ఈ వీడియో క్లిప్పింగులను శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీడియాకు విడుదల చేశారు. ఇందులో ఓ టీడీపీ నేత తాను టీడీపీని నమ్ముకొని రోడ్డున పడ్డానని.. కట్టుబట్టలతో మిగిలానని ఆ నాయకుడు విమర్శించాడు. తన బాధలను నారా లోకేష్ కు చెబితే సూసైడ్ చేసుకోమని సలహా ఇచ్చాడని ఆయన వాపోయారు.
దీనికి అచ్చెన్నాయుడు బదులిస్తూ సముదాయించినట్టు ఈ వీడియోలో రికార్డ్ అయ్యింది. కొన్ని సీరియస్ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. 12 కోట్ల రూపాయలను తాను పార్టీ కోసం ఖర్చు పెట్టానని.. తనను ఆదుకోవాలని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పెద్దాయన చంద్రబాబును కలిసి అభ్యర్థించానని వీడియోలో ఓ టీడీపీ నేత చెప్పారు.
తిరుపతి ఉప ఎన్నికల తర్వాత అందరం ఫ్రీ అయిపోతమని అచ్చెన్నాయుడు అన్నట్టు వీడియోలో వినిపించింది. పార్టీ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యానించినట్టు వీడియోలో వినిపిస్తోంది.అయితే ఈ వీడియోలు అసలైనవేనా? ఎవరైనా మార్ఫింగ్ లు చేశారా? అన్నది తేలాల్సి ఉంది. వైసీపీ నేత విడుదల చేయడంతో వీటిపై టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు.
Full View