బాలీవుడ్ లో మరో బెదిరింపుల కలకలం.. చంపేస్తామంటూ నటి స్వరాభాస్కర్ కు లేఖ

Update: 2022-06-30 03:41 GMT
స్వరా భాస్కర్.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్లందరికీ ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి సోషల్ మీడియాలో తరచూ వివాదాస్పద పోస్టులు పెడుతుంటారు. వివిధ సామాజిక అంశాలపై సోషల్ మీడియాలో స్పందించే తత్వం నటి స్వర భాస్కర్ ది. ఇండస్ట్రీలో జరిగే చర్చల మీద అయినా.. సామాజిక అంశాల మీద అయినా ఆమె డేర్ గా స్పందిస్తూ ఉంటుంది. తన అభిప్రాయాలను కుండబద్దలు కొడుతూ చెప్పగల నటి ఈమె. ఇలాంటి వారే కొన్ని పార్టీల వారికి కొన్ని రాజకీయ భావజాలాలు ఉన్న వారికి టార్గెట్ అవుతుంటారు. తమతో రాజకీయంగా విభేదిస్తూ పోస్టులు పెట్టే సెలబ్రెటీలను వివిధ రకాలుగా టార్గెట్ చేసుకోవడం కొందరు నెటిజన్లకు అలవాటు. ఇప్పుడు స్వరభాస్కర్ పై వీరందరూ పడ్డారు.

కొద్దిరోజుల క్రితం నటి స్వర భాస్కర్ నటించిన 'వీర్ దే వెడ్డింగ్' సినిమా విడుదలైంది. ఈ సినిమాలో స్వరా నటించిన ఓ సీన్ చాలా పెద్ద వివాదాన్ని సృష్టించింది. అందుకు కారణం ఆ సీన్ లో ఆమె స్వయంతృప్తి పొందేందుకు చేసిన ఓ చర్యనే.  సాధారణంగా మగవారు స్వయంతృప్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే నటి స్వర భాస్కర్ ఆ సీన్ ను సినిమాలో చేయడంతో ఆమెపై విమర్శల వర్షం కురుస్తోంది.

మొన్న సల్మాన్ ఖాన్ కు ఎదురైన బెదిరింపులు ఘటన మరిచిపోకముందే తాజాగా మరో బాలీవుడ్ నటిని చంపేస్తామంటూ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు లేఖను రాశారు. సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందించే ప్రముఖ నటి స్వరాభాస్కర్ కు ఈ బెదిరింపులు వచ్చాయి. ఆమెను చంపేస్తామంటూ ఇంటికి లేఖ పంపించారు. మహారాష్ట్రలోని వెర్సోవాలో ఉన్న ఆమె నివాసానికి స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ బెదిరింపు లేఖను పంపారు. దీనిపై స్వరాభాస్కర్ పోలీస్ స్టేన్ ను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వీర్ సావర్కర్ ను అవమానిస్తే దేశ యువత సహించబోదంటూ హిందీలో ఉన్న ఆ లేఖలో పేర్కొన్నారు. వీర్ సావర్కర్ ను అవమానిస్తే దేశ యువత సహించబోదంటూ హిందీలో ఈ లేఖను రాశారు ఆగంతకులు.

2017లో స్వరాభాస్కర్ వీరసావర్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఓ వెబ్ సైట్ లో వచ్చిన కథనంపై స్పందిస్తూ.. 'జైలు నుంచి బయటకు రావడానికి బ్రిటీష్ ప్రభుత్వానికి సావర్కర్ క్షమాపణలు చెప్పారు. అందువల్ల ఆయన 'వీర్' ఎప్పటికీ కాదు' అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. అనంతరం వీర్ సావర్కర్ పై కూడా మరో ట్వీట్ చేసింది. ఈ పోస్టులు పెనుదుమారం రేపాయి.

ఈ క్రమంలోనే ఆమెకు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తామంటూ లేఖను రాశారు. సావర్కర్ కు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టినందుకు ఆమెను చంపేస్తామంటూ పరుష పదజాలంతో లేఖను రాశారు.  తాజాగా ఉదయ్ పూర్ లో జరిగిన దర్జీ హత్యపై కూడా స్వరాభాస్కర్ స్పందించడంతో ఆమెను కొందరు టార్గెట్ చేశారు.
Tags:    

Similar News