అదేంటి... సుమారు మూడున్నర లక్షలకు పైగా మెజారిటీతో ఘనవిజయం సాధించి గెలిచిన నరేంద్ర మోడీ ఎన్నిక చెల్లకపోవడం ఏమిటి? సుమారు రెండున్నరేళ్లుగా ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తికి సంబందించిన ఎన్నిక చెల్లదంటూ ఇప్పుడు మాట్లాడటం ఏమిటి? ఈ విషయాలన్నింటికీ క్లారిటీ ఇస్తున్నారు ఒక కాంగ్రెస్ నేత. అసలు మోడీ పార్లమెంటుకు ఎన్నికవడమే పెద్ద రాంగ్ కూడా అంటున్నారయన. అంతేనా... నరేంద్ర మోడీ ఎన్నికను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ తాజాగా కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... కోర్టు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది.
విషయనికొస్తే... బీజేపీ ప్రధాని అభ్యర్థిగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ - యూపీలోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతం అయిన వారణాసి నుంచి పార్లమెంటు అభ్యర్థిగా పోటీకి దిగారు. ఈ ఎన్నికల్లో భారీ ఎత్తున పర్యటించి - ప్రచారం చేసుకుని తనను గెలిపించాలని అభ్యరించారు. దేశం మొత్తం మీద బీజేపీని గెలిపించగల సమర్ధుడు తనను తాను గెలిపించుకోలేరా? ఆయనను నమ్మి దేశం మొత్తం ఓటేసింది, వారణాసి ప్రజలు వెయ్యారా? వేశారు.. ఫలితంగా దాదాపు 3.37 లక్షల ఓట్ల మెజారిటీతో మోడీ ఘన విజయం సాధించారు. ఈ స్థానం నుంచే కాంగ్రెస్ తరుపున మోడీపై పోటీ చేసిన అజయ్ రాయ్ ఘోర ఓటమి పాలయ్యారు.. అదంతా గతం! ఐతే తాజాగా నాటి ఎన్నికపై స్పందించిన ఈయన నరేంద్ర మోడీ ఎన్నిక చెల్లదంటూ సరికొత్త వాదనను తెరమీదకి తెచ్చారు.
ఈ విషయంలో తన లాజిక్ ను వివరించిన రాయ్... ఎన్నికల సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా నరేంద్రమోడీ వ్యవహరించారని.. ఎన్నికల సమయంలో మోడీ చిత్రాలున్న టీషర్ట్ లను - పోస్టర్లను ఓటర్లకు పంచిపెట్టారని.. ఇది ఓ రకంగా ఓటర్లకు లంచం ఇవ్వడం కిందకే వస్తుందని పేర్కొన్నారు. ఈ కారణాలను పరిగణలోకి తీసుకుని ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు అజయ్ రాయ్. అయితే ఈ ఈ పిటిషన్ ను హైకోర్టు స్వీకరించింది, దీనిపై వాదనలు కూడా జరిగాయి.
అయితే ఈ విషయాలపై స్పందించిన మోడీ తరుపు న్యాయవాదులు... అసలు ఈ పిటిషనే విచారణకు అర్హమైనది కాదని, కేవలం మోడీపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ చర్యకు ఉపక్రమించారని తెలిపారు. అయితే కచ్చితంగా ఇది ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడంలోకే వస్తాదని, ఆయన ఎన్నిక చెల్లదని వాదించారు రాయ్ తరుపు న్యాయవాదులు. కాగా, ఈ రసవత్తర చర్చకు సంబందించి తదుపరి విచారణ వచ్చే నెల 15కి వాయిదా పడింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/