కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అంటారు పెద్దలు కానీ.. జీవితంలో అలా అయితే పొరపాటు లేదు.. కానీ మానవ శరీరంలో అయితేనే సమస్య. ఇప్పుడో వ్యక్తికి అలానే అయ్యింది. ఎడమ పక్కన ఉండే గుండె కుడిపక్కన ఉంది. కుడిపక్కన ఉండే కాలేయం.. ఎడమ పక్కన ఉంది. మొత్తం కడుపులోని అవయావలన్నీ రివర్స్ లో ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని కుషినగర్ కు చెందిన ఓ వ్యక్తి తాజాగా కడుపునొప్పి రావడంతో గోరక్ పూర్ లోని వైద్యుడిని సంప్రదించాడు. ఎక్స్ రే, అల్ట్రాసౌండ్ చేసిన వైద్యుడు అతడి అవయవాలన్నీ వ్యతిరేకదిశలో ఉన్నాయని చూసి ఆశ్చర్యపోయాడు. ఇతడికి పిత్తాశయంలో రాళ్లు వచ్చాయని వాటిని లాప్రోస్కోపిక్ మెచిన్స్ ద్వారా తొలగించడం కష్టం అని తేల్చారు. ఈ ఆపరేషన్ అన్ని అవయవాలు సరైన స్థానంలో ఉండేవారికే చేయవచ్చని వైద్యులు తెలిపారు.
ఇలా అవయవాలన్నీ వ్యతిరేక దిశలో ఉండటాన్ని సీటస్ ఇన్వెర్సస్ అంటారు. ఈ సమస్య ఉన్న వారికి తమ అవయవాలు రివర్స్ లో ఉన్నాయని తెలియదు. సమస్య వస్తేనే తెలుస్తుంది. అయితే ఇలా రివర్స్ లో ఉండడం వల్ల ఎటువంటి ప్రమాదం మనిషి కి ఉండదు. అన్నీ సక్రమంగానే పనిచేస్తాయి. చికిత్సలు చేయడమే కష్టం. ఇలా ఉండడం ప్రపంచంలోనే అరుదు. ఇప్పటివరకు 1643మందికి మాత్రమే ఇలా అవయవాలు రివర్స్ లో ఉన్నట్లు తెలిసింది.