రికార్డులన్నీ మనవైపే.. కోహ్లికి అచ్చొచ్చిన మైదానం.. ఇంగ్లండ్ పై విజయ ఢంకానే
ఇంగ్లండ్ జట్టులో భారీ హిట్టర్లు ఉండొచ్చుగాక.. మెరుపు పేస్ బౌలర్లు ఉండొచ్చుగాక.. గురువారం జరుగబోయే టి20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్ లో టీమిండియానే ఫేవరెట్ అని చెప్పొచ్చు. మైదానంలో రికార్డుల పరంగా చూసినా.. గణాంకాల లెక్కలు తీసినా.. ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణించినా భారత్ దే గెలుపుని స్పష్టమవుతోంది. రెండు జట్ల బలాబలాల్లో పేస్ బౌలింగ్ ఒక్కటే కాస్త తేడా. బుమ్రా దూరం కావడంతో రోహిత్ సేనకు కాస్త లోటు ఏర్పడినా.. యువ పేసర్ అర్షదీప్ సింగ్ దానిని భర్తీ చేస్తున్నాడు. మరోవైపు బ్యాటింగ్ లో భారత్-ఇంగ్లండ్ సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి.
వారి టాప్ 4.. మన టాప్ 4
రోహిత్, రాహుల్, కోహ్లి, సూర్య కుమార్.. టీమిండియా టాప్ -4 బ్యాటింగ్ ఆర్డర్ ఇది. వీరిలో ఏ ముగ్గురు విజయవంతం అయినా జట్టు స్కోరు 190కి తగ్గదు. ఇక రోహిత్ ఫామ్ కొంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ అతడి స్థాయి ఆటగాడు కుదురుకోవడానికి ఒక్క ఇన్నింగ్స్ చాలు. మిగతా ముగ్గురూ ఫామ్ లో ఉన్నారు. ఇక ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ ను చూస్తే బట్లర్, హేల్స్, మలన్ లేదా లివింగ్ స్టన్, స్టోక్స్. వీరంతా విధ్వంకారులే. అయితే, మలన్ ఆడేది అనుమానంగా ఉంది. అతడు దూరమైతే ఫిల్ సాల్ట్ కు అవకాశం దక్కుతుంది. కాగా, వీరిలో ఏ ఒక్కరి ఫామ్ నిలకడగా లేదు. హేల్స్ గత మ్యాచ్ లో బాగా ఆడాడు. బట్లర్ అంతకుముందు మ్యాచ్ లో రాణించాడు. లివింగ్ స్టన్ భారీ హిట్టరే అయినా.. టోర్నీలో అతడి స్థాయి ఆటను కనబర్చలేదు. అయితే, స్టోక్స్ మాత్రం రాణిస్తున్నాడు.
ఆల్ రౌండ్ .. ఆల్ రౌండ్
టీమిండియాకు హార్దిక్ పాండ్యా రూపంలో మంచి పేస్ ఆల్ రౌండర్ ఉంటే ఇంగ్లండ్ కు బెన్ స్టోక్స్ ఉన్నాడు. ఫీల్డింగ్ లోనూ వీరిద్దరూ మెరికలే అని చెప్పాల్సిన పనిలేదు. కాగా ఇద్దరూ మంచి లయలో ఉండడం.. పూర్తి స్థాయి బౌలింగ్ కోటా వేస్తుండడం మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేయొచ్చు. కాగా, హార్దిక్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఐదో స్థానంలో దిగుతుండగా.. స్టోక్స్ నాలుగు లేదా ఐదో స్థానంలో ఆడే చాన్సుంది. ఈ విషయంలోనూ ఇద్దరి మధ్య సామీప్యత ఉండడం విశేషం. కాకపోతే.. స్టోక్స్ ఎడమ చేతివాటం ఆటగాడు కావడం ఒక్కటే ఇద్దరి మధ్య విభిన్నత.
స్పిన్ ఆల్ రౌండ్
టీమిండియాకు ఈ విషయంలో పెద్ద లోటు రవీంద్ర జడేజా దూరం కావడం. ఇంగ్లండ్ కు మోయిన్ అలీ రూపంలో మంచి స్పిన్ ఆల్ రౌండర్ ఉన్నాడు. అయితే, మనకు అశ్విన్ ఉన్నప్పటికీ మోయిన్ స్థాయి హిట్టర్ కాదు. కాకపోతే.. మరో స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కాస్త బ్యాట్ ఝళిపించగలడు. వెస్టిండీస్ లో అతడు ఈ తరహా ప్రదర్శన కనబరిచాడు కూడా. కానీ, ఆస్ట్రేలియా లాంటి పెద్ద మైదానాల్లో అక్షర్ హిట్టింగ్ సరిపోవడం లేదు. అక్షర్+అశ్విన్ : మోయిన్ అలీగా చెప్పొచ్చు. ఇంగ్లండ్ మరో స్పిన్నర్ ఆదిల్ రషీద్ మన ఇద్దరు స్పిన్నర్లతో పోలిస్తే కాస్త స్థాయి తక్కువే. కానీ, అతడి స్పిన్ లో మోయిన్ అలీ కంటే వైవిధ్యం ఉంటుంది.
పేస్.. రేస్..
షమీ, భువనేశ్వర్, అర్షదీప్.. ఇదీ మన ప్రధాన పేస్ దళం. కీలక మ్యాచ్ కావడంతో హర్షల్ పటేల్ కు చాన్స్ తక్కువే. టో్ర్నీలో వీరంతా మంచి ఫామ్ లో ఉన్నారు. బుమ్రా లేని లోటును అర్షదీప్ అద్భుతంగా కవర్ చేస్తున్నాడు. షమీ.. ఎప్పటికీ ప్రమాదకర బౌలరే. ఇక స్వింగ్ కు అనుకూల వాతావరణంలో భువనేశ్వర్ ను నిలువరించలేం. కాగా, ఇంగ్లండ్ జట్టులో మార్క్ ఉడ్, క్రిస్ వోక్స్, సామ కరన్ ప్రధాన పేస్ బౌలర్లు. వీరిలో గాయంతో ఉడ్ దూరమయ్యేలా కనిపిస్తున్నాడు. దీంతో క్రిస్ జోర్డాన్ ను తీసుకునే వీలుంది. వోక్స్, కరన్ అత్యంత నాణ్యమైన పేసర్లేమీ కాదు. దీంతోనే ఇంగ్లండ్ జట్టు స్టోక్స్ మీద ఆధారపడుతుంటుంది. ఉడ్ దూరమైతే పేస్ దళం కాస్త బలహీనం అవుతుంది. పేస్ విషయంలో భారత్ దే పైచేయి అని చెప్పొచ్చు.
‘‘కీ’’లకం ఇక్కడే..
టాప్ 4 పోగా.. ఇంగ్లండ్ కు స్టోక్స్, మోయిన్ అలీలా భారత్ కు హార్దిక్, పంత్ లేదా కార్తీక్ ఉన్నారు. వీరిలో ఎవరు చివర్లో మెరిస్తే ఆ జట్టుదే గెలుపని చెప్పొచ్చు. కాకపోతే.. ఇంగ్లండ్ కు కరన్ రూపంలో 7వ నంబరులోనూ మంచి బ్యాటర్ ఉన్నాడు. మనం మాత్రం అశ్విన్ పై భారం వేయాల్సి వస్తోంది.
లెఫ్ట్ హ్యాండర్లకు అడ్డుకట్ట ఎలా...?
మలన్ (గాయంతో దూరం కాకుంటే), స్టోక్స్, కరన్, మోయిన్ అలీ.. ఇంగ్లండ్ జట్టులో ఎడమచేతివాటం బ్యాటర్లు. వారి జట్టులో నలుగురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లుండగా.. మనకు మాత్రం పంత్ (తుది జట్టులోకి తీసుకుంటే), అక్షర్ మాత్రమే లెఫ్ట్ హ్యాండర్లు. ఇక్కడే జట్టు కూర్పులో ఇంగ్లండ్ కాస్త వైవిధ్యంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్ లో లెఫ్ట్, రైట్ కాంబినేషన్ ను నిలువరించేందుకు బౌలర్లు శ్రమపడాల్సి వస్తుంటుంది.
గణాంకాలు ఇవీ...
టి20ల్లో ఇప్పటిదాకా భారత్-ఇంగ్లండ్ 22 సార్లు తలపడగా.. భారత్ 12 సార్లు, ఇంగ్లండ్ 10 సార్లు గెలిచాయి. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు 3 సార్లు (2007, 2009, 2012) ఎదురెదురుపడగా.. టీమిండియా 2, ఇంగ్లండ్ ఒక్క సందర్భంలో గెలుపొందాయి. మరోవైపు మ్యాచ్‌కు వేదిక అయిన అడిలైడ్‌లో ఇంగ్లండ్‌కు చెత్త రికార్డు ఉండటం టీమిండియాకు అదనంగా కలిసొచ్చే అంశం. ఇక ఈ వేదికపై ఇంగ్లండ్ 17 వన్డేలు ఆడగా.. కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఆ జట్టు ఈ వేదికపై ఆడిన ఒకే ఒక టీ20లో (2011) ఆతిధ్య జట్టుపై అతికష్టం మీద గెలువగలిగింది.
ఈ రికార్డులే కాక, అడిలైడ్‌లో కోహ్లి వ్యక్తిగత రికార్డులు, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదే వేదికపై బంగ్లాదేశ్‌పై విజయం, ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు ఈ వేదికపై ఆడిన అనుభవం లేకపోవడం టీమిండియాకు అదనంగా కలిసొచ్చే అంశాలు. కాగా, ఆడిలైడ్ లో మ్యాచ్ అంటే కోహ్లీకి పూనకం వస్తుంది. ఇక్కడ అతను ఆడిన 14 ఇన్నింగ్స్‌ల్లో (మూడు ఫార్మాట్లలో కలిపి) 75.5 సగటున 907 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా 5 సెంచరీలు ఉండటం విశేషం. ముఖ్యంగా టీ20ల్లో కోహ్లికి ఈ వేదికపై ఘనమైన రికార్డు ఉంది. ఇక్కడ అతనాడిన రెండు మ్యాచ్‌ల్లో రెండు అర్ధసెంచరీల సాయంతో 155.55 సగటున 154 పరుగులు చేశాడు. 2016లో 90 నాటౌట్, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఈ వేదికపై టీమిండియాకు ఓ మ్యాచ్ ఆడిన (బంగ్లాతో) అనుభవం ఉండగా.. ఇంగ్లండ్ తొలిసారిగా ఆడుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.