జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పార్టీపరంగా నెల్లూరు జిల్లాకు బాగా ప్రాధాన్యత పెరిగిపోయినట్లే ఉంది. మామూలుగా ఏ జిల్లాలో అయినా ఇద్దరు ఎంపీలుండటం సహజమే. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో రాష్ట్రంలోని 25 ఎంపీ స్ధానాలకు గాను 22 చోట్ల గెలిచింది. కాబట్టి శ్రీకాళం, కృష్ణా, గుంటూరు జిల్లాలు తప్ప మిగిలిన అన్నీ జిల్లాల్లోను వైసీపీనే రెండు సీట్లు గెలుచుకుంది.
అయితే అన్ని జిల్లాల పరిస్ధితి వేరు నెల్లూరు జిల్లా పరిస్ధితి వేరన్నట్లుగా ఉంది. ఎలాగంటే ఈ జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. 10 అసెంబ్లీలకు పదింటినీ వైసీపీనే గెలిచింది. దాంతో నెల్లూరు లోక్ సభ అభ్యర్ధిగా ఆదాల ప్రభాకరరెడ్డి గెలిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే జిల్లాకు రెండు రాజ్యసభ స్థానాలు దక్కాయి.
ముందు విజయసాయిరెడ్డి తర్వాత వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి రాజ్యసభ ఎంపీలయ్యారు. దాంతో జిల్లా నుంచి ముగ్గురు ఎంపీలున్నట్లయ్యింది. తాజాగా ఎంపిక చేసిన నలుగురు రాజ్యసభ ఎంపీల అభ్యర్ధుల్లో బీద మస్తానరావున్నారు.
ఈయనది కూడా నెల్లూరు జిల్లాయే. అంటే జిల్లా నుంచి నలుగురు ఎంపీలున్నట్లు లెక్క. ఒకే కాలంలో ఒకే జిల్లా నుండి ఇంత మంది ఎంపీలుండటం అరుదనే చెప్పాలి. ఒంగోలు లోక్ సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా కలుపుకుంటే ఐదుగురు ఎంపీలవుతారు.
ఎలాగంటే మాగుంట ఎంపీగా ఒంగోలు నుండి గెలుస్తున్నా ఈయనది కూడా నెల్లూరు జిల్లానే అన్న విషయం తెలిసిందే. అంటే ఐదుగురు నెల్లూరు జిల్లా నేతలు ఏకకాలంలో ఒకే పార్టీ నుండి ఎంపీలుగా ఉండటమంటే మామూలు విషయం కాదు. జగన్ ప్రభుత్వం నెల్లూరు జిల్లాకు బాగా ప్రాధాన్యత ఇస్తున్నట్లే ఉంది.
ముందు ముందు జిల్లాకు ఇంకెన్ని పదవులు దక్కుతాయో చూడాలి. పార్టీని అంతగా ఆదరిస్తున్న జిల్లాకు ఇన్ని ఎంపీ పదవులను ఇచ్చి జగన్ కూడా తన రుణాన్ని తీర్చుకుంటున్నట్లే ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో పార్టీని జిల్లా ఎలా ఆదరిస్తుందో చూడాల్సిందే.