తనదైన శైలిలో నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగే గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మరో సంచలన పథకానికి నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. " పేదవాడికి 4 రూపాయలకే భోజనం" పథకాన్ని ప్రారంభించనున్న ఆర్కే ప్రకటించారు. ఆదివారం దివంగత నేత రాజశేఖరరెడ్డి 2004 మే 14 వ తేది ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్కే వెల్లడించారు. ఇటీవలే హైదరాబాద్‌లో జీహెచ్ ఎంసీ-హరేకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నపూర్ణ రూ.5 భోజన కేంద్రంలో భోజనం చేసి తమ నియోజకవర్గంలో అమలు చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే ఆర్కే ప్రకటించిన సంగతి తెలిసిందే.
వైఎస్ రాజశేఖరరెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజే ఎన్నో ప్రజాసంక్షేమ పథకాలకు అంకురార్పణ చేసిన రోజు అని ఆర్కే తెలిపారు. అందుకే ఆ రోజునే పేదవాడి ఆకలి తీర్చాలని ఓ మంచి ఆశయంతో ``రాజన్న క్యాంటీన్`` ప్రారంభిస్తున్నట్లు ఆర్కే వెల్లడించారు. కేవలం 4 రూపాయలకే కూర అన్నం - పెరుగు అన్నం - వారం లో 4 రోజులు ఒక కోడిగుడ్డు - మిగిలిన 3 రోజులు అరటి పండు - వడియాలు - వాటర్ ప్యాకెట్ వంటివి భోజనంలో భాగంగా అందించనున్నట్లు ఆర్కే వివరించారు. ఈ క్యాంటీన్ ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు మంగళగిరి పట్టణం లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేస్తారు. నిత్యం 3వందల నుండి 5 వందల మందికి ఈ భోజనం అందజేస్తారు. ఈ భోజన పధకాన్ని మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/