ముఖం పగిలేలా విమర్శల పంచ్ లు ఇవ్వటం మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అలవాటే. ప్రజలతో మమేకమవుతూ.. అధికారంలో ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల మధ్య ఉండే ఆయన తీరే.. లోకేశ్ మీద గెలిపించేలా చేసిందని చెప్పాలి. తమ భావి అధినేత అవకాశాల్ని దారుణంగా దెబ్బ తీసిన ఆళ్ల మీద తెలుగు తమ్ముళ్లకు గొంతుల వరకూ కోపం ఉందన్న విషయం తెలిసిందే.
అందుకు అయిన దానికి కాని దానికి అదే పనిగా విమర్శలు చేయటం మామూలే. ప్రతి విషయంలోనూ ఆరోపణలు చేసే తెలుగు తమ్ముళ్ల తీరుకు తాజాగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఊహించని రీతిలో సవాల్ విసిరారు. తన మీద చేస్తున్న ఆరోపణల్లో ఏ ఒక్కదానినైనా నిరూపించిన పక్షంలో తాను రాజకీయాల నుంచి శాశ్వితంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు.
వైఎస్సార్ పెన్షన్ల కానుకను ప్రారంభించిన సందర్భంగా ఆయన అర్హులైన వారికి పెన్షన్లు పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో మాదిరి పింఛన్ల కోసం ఇకపై ఏ అధికారిని.. రాజకీయ నేత చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని.. అర్హులైన వారంరికి ఇళ్ల వద్దకే పింఛన్లు వచ్చేలా చేస్తామన్నారు. అక్టోబరు 2 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. అదే సమయంలో తనపై అదే పనిగా ఆరోపణలు చేసే తెలుగు తమ్ముళ్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆళ్ల మీద చేసిన ఆరోపణల్ని నిరూపిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఆళ్ల సవాలు చూస్తే.. తమ్ముళ్ల సత్తాకు అసలుసిసలు పరీక్ష పెట్టినట్లుగా చెప్పక తప్పదు.