సమయం.. సందర్భం చూసుకొని పంచ్ వేస్తే అదిరిపోవాలి. ఏపీ విపక్ష పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్య ఇదే రీతిలో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో తమను వ్యంగ్యంగా విమర్శించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు తెగ ఉత్సాహం ప్రదర్శించే బాబుకు భారీ పంచ్ ఇచ్చేలా ఆయన వ్యాఖ్యలున్నాయన్న మాట వినిపిస్తోంది.
సోషల్ మీడియాలో వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసే వారిపై తీవ్ర అసహనంతో కేసులు పెట్టిస్తున్నారన్న ఆళ్ల.. తాజాగా బాబు నిర్ణయాల్ని తీవ్రంగా తప్పు పడుతూ.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ సోషల్ మీడియా ద్వారా లేఖ రాశారు. బాబు పాలనను నియంతృత్వ పాలనగా అభివర్ణించిన కట్జూ మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కాలిఫోర్నియా నుంచి పంపిన కట్జూ లేఖలపై ఏపీ పోలీసులను అమెరికాకు పంపించి అరెస్టు చేయిస్తారేమో? అంటూ ఆళ్ల వేసిన పంచ్ బాబు అండ్ కోకు సూటిగా తగులుతుందన్న వాదన వినిపిస్తోంది.
రాజ్యాంగంలోని అధికరణ 19(1ఏ) ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛను బాబు హరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల వేళలో చంద్రబాబు ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోవటంతో తెలుగు ప్రజలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే.. బాబుకు వణుకు పుడుతుందన్నారు. తాజాగా కట్జూ లేఖ.. ఇప్పటికే విపక్ష నేత జగన్ ఇచ్చిన బాబు అవినీతి పుస్తకం ఎంపరర్ ఆఫ్ కరప్షన్ లాంటి అంశాల నేపథ్యంలో రాష్ట్రపతి.. ప్రధానులు కానీ ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్న ఆలోచన వస్తే.. చంద్రబాబు వారినీ అరెస్ట్ చేయిస్తారేమోనని భయంగా ఉందని ఎద్దేవా చేశారు. అదిరిపోయే టైమింగ్ తో బాబు పై వేస్తున్న పంచ్ లు ఓ రేంజ్లో ఉన్నాయంటూ ఆళ్లపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/