పైలట్... ఆకాశయానంలో విహరించే వారి ప్రాణాలన్నీ అతడి చేతిలోనే ఉంటాయి. వందలాది మంది ప్రాణాలను గుప్పెట పట్టుకునే సదరు పైలట్ ఎలా ఉండాలి. కరెక్టుగా - స్టిఫ్ గా - ఏదేని అవాంఛనీయ పరిస్థితుల్లో సమయస్ఫూర్తి, ప్రమాద సమయాల్లో వేగంగా స్పందించే మస్తిస్కం... అన్నీ ఉండాల్సిందే. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పైలట్ ఆ విషయాలన్నింటినీ గంగలో కలిపేశాడు. ఎలా ఉండాలో... అందుకు విరుద్ధంగా ఉన్నాడు. విరుద్ధంగా ఉండటమే కాదండోయ్.. ఏకంగా విమానం నడిపేందుకు కూడా వచ్చేశాడు. దీంతో బెంబేలెత్తిపోయిన ప్యాసింజర్స్... అతడిపై విమానయాన అధికారులకు కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ ఆధారంగా విచారణ చేపట్టిన అధికారులు ఏకంగా నోరెళ్లబెట్టారు.
ఇక అసలు విషయంలోకి వస్తే... ఇండోనేసియాకు చెందిన సిటీ లింక్స్ ఎయిర్ లైన్స్ కు చెందిన పైలట్ కెప్టెన్ టెకాద్ పూర్ణ... ఎప్పటిలానే ఈ రోజు కూడా విధులకు హాజరయ్యారు. అయితే ఎప్పటిలానే అతడు సరైన పొజిషన్ లో డ్యూటీకి రాలేదు. పూటుగా మద్యం సేవించి తూలుతున్న స్టేజ్ లో ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అంతేనా... తాను ఎక్కాల్సిన విమానం ఎక్కేసి సాధారణంగా టేకాఫ్ కు ముందు ఇచ్చే అనౌన్స్ మెంట్ ను కూడా మరిచి విమానాన్ని గాల్లోకి ఎగిరించేందుకు యత్నించాడు. అయితే అతడు విమానాన్ని టేకాఫ్ చేసేందుకు యత్నిస్తున్న సమయంలో అతడి వాలకం చూసి అనుమానం వచ్చిన కొందరు ప్రయాణికులు అసలు విషయం తెలుసుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో హుటాహుటీన రంగంలోకి దిగిన అధికారులు అతడిని ఫ్లైట్ దింపేసి... విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విచారణలో భాగంగా అతడి అసలు రూపం చూసి అధికారులు నివ్వెరపోయారట. టెకాద్ ఎయిర్ పోర్టులోకి ఎంటరవుతున్న సందర్భంగా రికార్డైన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన అధికారులు... అతడిపై మరింత లోతుగా దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. ఇక టెకాద్ నిర్వాకాన్ని పసిగట్టలేని ఇద్దరు ఉన్నతాధికారులు అతడి కారణంగా తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేయాల్సి వచ్చిందట. ఇక ఎయిర్ పోర్టులోకి ఎంటరవుతున్న సమయంలో అతడికి సంబంధించి దృశ్యాలను పరిశీలిస్తే... మనకు కూడా నవ్వు రాక మానదు. ఎంట్రెన్స్ వద్ద కస్టమ్స్ తనిఖీ దగ్గర టెకాద్ చేసిన హడావిడి అంతాఇంతకాదు. బ్యాగుతో పాటు వస్తువులన్నిటినీ అతడు కిందపడేసుకుంటుంటే.. కస్టమ్స్ సిబ్బంది వాటిని ఏరి అతడికివ్వడం.. కడుపుబ్బా నవ్వు తెప్పిస్తోంది. అదే సమయంలో విమాన ప్రయాణికులను కలవరానికి గురిచేస్తోంది.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/