ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి మరో రెండు రోజులు మాత్రమే ఉంది. దీంతో ఆయా పార్టీల నాయకులు ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గ్యాప్ లేకుండా మండుటెండలో ప్రచారం చేయడంతో అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అప్పటి వరకు ఉధృత ప్రచారంలో మునిగిన పార్టీ నాయకులు పవన్‌ను కలిసి పరామర్శిస్తున్నారు. అయితే అస్వస్థత గురైన పవన్ కు ఇప్పుడు మెగా క్యాంప్ నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది.
పవన్ ఎండదెబ్బకు నీరసించి పోయి ఆసుపత్రి పాలై డీహైడ్రేషన్ నుంచి కోలుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆయన ప్రచారం చేసినప్పుడు రాని వారు ఇప్పుడు ఆయన దగ్గరకు వస్తున్నారు. దీంతో పరోక్షంగా పవన్‌కు వారి మద్దతు పెరుగుతుందన్నది టాక్. ఇక జనంలోనూ పవన్ పై సానుభూతి వ్యక్తమవుతోంది.
పవన్ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు మెగా ఫ్యామిలీ అంతా సంతోషించారు.. అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఏ ఒక్కరూ పవన్ తో కనిపించలేదు. కనీసం ప్రచారం కూడా చేయలేదు. దీంతో వారంతా పవన్ కు దూరమయ్యారని ప్రచారం జరిగింది. చిరంజీవి ఇప్పటివరకూ జనసేనపై స్పందించలేదు. కానీ పవన్ ఆసుపత్రిలో చేరగానే రామ్ చరణ్ తేజ్ వచ్చి కలిసి తన మద్దతు ప్రకటించారు. తాజాగా అల్లు అర్జున్ కూడా పవన్ ను కలిసేందుకు వస్తున్నారు..
ఈరోజు బన్నీ పుట్టిన రోజు కావడంతో రేపు ఉదయాన్నే రాజమండ్రి వెళ్లి.. అక్కడి నుంచి పాలకొల్లుకు వెళతారని తెలిసింది. అక్కడ పవన్ ను కలిసి జనసేన పార్టీకి మద్దతు పలుకుతారని సమాచారం. సమయం ఉంటే నర్సాపురం నుంచి పోటీచేస్తున్న నాగబాబును కూడా కలిసి వస్తారని తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఇలా మెగా హీరోలందరూ పవన్ వద్దకు రావడం మద్దతు తెలపడం ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది జనసేనకు కొండంత బలంగా మారింది.