దేశంలో చాలామందే ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ.. మరే ముఖ్యమంత్రికి లేనన్ని ‘ఇంటి ఇబ్బందులు’ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకే వస్తున్నాయి. రాష్ట్ర విభజన కారణంగా ఆయన ఫ్యామిలీ హైదరాబాద్ లో.. ఆయనేమో విజయవాడలో. ఇందుకోసం హైదరాబాద్ లో ఒక అధికారిక నివాసం.. బెజవాడలో మరొకటి. దీంతో పాటు.. మౌలిక సదుపాయాలు మొదలు.. హైటెక్ బాబుకి తగ్గట్లు ఏర్పాట్లు చేయటానికి పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇన్ని చేసిన తర్వాత ఆయన మరికొన్ని మార్పులు చేర్పులు సూచించటం.. వాటిని చేసేందుకు మళ్లీ పనులు చేపట్టటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది.
తాజా వ్యవహారమే చూస్తే.. ఆ మధ్యన జూబ్లీహిల్స్ లో అద్దె ఇల్లు తీసుకున్న బాబు.. రీసెంట్ గా దాన్ని ఖాళీ చేసి మదీనాగూడలోని తన ఫామ్ హౌస్ కి తరలించారు. ఇదే పని తొలుతే చేసి ఉంటే.. అద్దె ఇంటి కోసం పెట్టిన ఖర్చు వృధా అయ్యేది కాదు. ఇలా ఒకే పనిని అదే పనిగా చేయటం ఈ మధ్యన ఏపీ అధికారుల్లో కనిపిస్తోంది. ఇక.. బెజవాడకు దగ్గర్లోని ఏపీ ముఖ్యమంత్రి అధికార నివాసాన్నే చూస్తే ఇలాంటివే కనిపిస్తాయి.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లు అన్నాక.. రహదారులు.. ప్రత్యామ్నాయ రహదారులు మొదటే ఏర్పాటు చేసి.. అన్నీ పక్కాగా ఉన్నాయనుకున్న తర్వాత గృహప్రవేశం చేస్తారు. కానీ.. ఇలాంటి ఏర్పాట్లు ఏవీ ఏపీ అధికారులు పెద్దగా చేసినట్లుగా కనిపించని పరిస్థితి. అమరావతి కరకట్ట మార్గంలో ఉన్న చంద్రబాబు నివాసానికి ఇప్పుడున్న రహదారి కాకుండా మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఈ మధ్యనే నిర్ణయించారు. దీన్లో భాగంగా ఉండవల్లి దగ్గర కొండవీటి వాగు వంతెన నుంచి మరో మార్గాన్ని గుర్తించారు.
ఇందుకోసం 1.2 కిలోమీటర్ల మేర కొత్తగా రహదారి నిర్మించారు. ఈ రోడ్డు కోసం గ్రామీణాభివృద్ధి నిధుల నుంచి రూ.2.7కోట్లు ఖర్చు చేశారు. తాజా రోడ్డు నిర్మాణంతో ఉండవల్లి కూడలి నుంచి ఉండవల్లి గ్రామ శివార్లలోని కొండవీటి వాగు వంతెన మీదుగా సీఎం నివాసానికి చేరుకునే ప్రత్యమ్నాయ మార్గం సిద్ధమైందని చెప్పొచ్చు. కానీ.. ఇలాంటి ఏర్పాట్లు మొదటే చేయాల్సిన విషయాన్ని అధికారులు గుర్తిస్తే మంచిది. లేనిపక్షంలో సీఎం ఇంటి కోసం చేస్తున్న ఏర్పాట్లు తరచూ వార్తల్లోకి రావటం చంద్రబాబు సర్కారు మీద విమర్శలకు అవకాశాన్ని ఇస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.