కరణం బలరాం.. తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ నేత. ఆవిర్భావం దగ్గర నుంచి ఆ పార్టీలో కొనసాగిన వ్యక్తి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగా పని చేశారు కరణం బలరాం. అసెంబ్లీలో కూడా అప్పట్లో కరణం బలరాం హల్చల్ చేసేవారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించాకా గొట్టిపాటి కుటుంబం ఆ పార్టీలో చేరింది. వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యాక్టివ్ గా ఉండగా, కరణం బలరాం హార్డ్ కోర్ టీడీపీ నేతగా వ్యవహరించారు. గొట్టిపాటి రవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరాకా.. చాలా రచ్చ జరిగింది. గొట్టిపాటి, కరణం వర్గాలు ఢీ అంటే అంటే ఢీ అన్నాయి. కరణం బలరాం, గొట్టిపాటి రవిలు పరస్పరం ఎదరుపడి తలపడినంత పని చేశారు.
గొట్టిపాటి రవి తెలుగుదేశం పార్టీ చేరికను కరణం బలరాం తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబుకు అదే విషయాన్ని చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే చంద్రబాబు నాయుడు ఆ అభ్యంతరాలను ఖాతరు చేయలేదు. ఆ సమయంలో కరణం బలరాం తెలుగుదేశం పార్టీని వీడతారని వార్తలు వచ్చాయి. అయితే అలాంటిది ఏమీ జరగలేదు.
తనకు ఏ మాత్రం నచ్చని గొట్టిపాటి తెలుగుదేశం పార్టీలో ఉన్నా.. ఆయన ఆ పార్టీని వీడలేదు. ఆఖరికి ఎన్నికల సమయంలో కూడా టీడీపీకే కట్టుబడ్డారు. చివరకు కరణం బలరాం కు అద్దంకి టికెట్ దక్కలేదు. చీరాల వెళ్లి పోటీ చేయాలంటూ చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆ మేరకు ఆ ఆదేశాలను పాటించారే కానీ, తెలుగుదేశం పార్టీని మాత్రం వీడలేదు. చివరకు చీరాల నుంచి నెగ్గారు. కానీ టీడీపీ అధికారంలోకి రాలేదు. అక్కడే వచ్చిందట అసలు చిక్కు!
చీరాల్లో ఓడిపోయినా.. ఆమంచి కృష్ణమోహన్ దెబ్బకు కరణం బలరాం నిలవలేకపోయినట్టుగా తెలుస్తోంది. చీరాలకు ఎమ్మెల్యే కరణం అయినా, అనధికారికంగా ఆమంచే చక్రం తిప్పుతూ ఉన్నారట. అధికార పార్టీ కావడం, వ్యక్తిగతంగా క్యాడర్ కలిగిన వ్యక్తి కావడం తో.. ఆమంచి దెబ్బకు కరణం తట్టుకోలేకపోయినట్టుగా భోగట్టా. ఎన్నికలు పూర్తై ఏడాదైనా కాలేదు. ఈ మాత్రానికే కరణం తట్టుకోలేకపోయారని, ఇక చేసేది లేక ఆయన తనయుడిని వైసీపీలోకి పంపి, తను సీఎంను కలిసినట్టుగా టాక్ వస్తోంది.
కరణం బలరాంకు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీపై ప్రేమ ఏమీ తగ్గలేదని, చంద్రబాబుకు ఆయన విధేయుడే అని, అయితే ఆమంచి దెబ్బకు తాళలేకే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారని స్థానికంగా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.