రాజధాని ప్రాంతం లో జరుగుతున్న ఆందోళనలు, నిరసన కార్యక్రమాల వెనుక ఎవరున్నారనే అంశం గురించి ఆరా తీస్తున్నాయట ఏపీ పోలీసు వర్గాలు, నిఘా వర్గాలు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటన తర్వాత అమరావతి లో నిరసన ప్రదర్శనలు సాగుతున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల ప్రకటన తో సహజం గానే అమరావతి లో నిరసన ఉండవచ్చు. చంద్రబాబు నాయుడు అర చేతి లో స్వర్గం చూపించి, అమరావతి ప్రాంతంలో భూములు రైతుల నుంచి తీసుకున్నారు.
ఇక రియలెస్టేట్ బూమ్ కూడా ఆ ప్రాంతం లో బాగా పెరిగింది. ఇప్పుడు మూడు రాజధానులు.. అంటే సహజంగానే అక్కడ రియల్ బూమ్ తిరోగమనంలో పడిపోతుంది. ఈ నేపథ్యంలో అక్కడ నిరసనలు జరుగుతూ ఉండవచ్చు. అయితే మూడు రాజధానుల ప్రకటనలను ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ ను వారు సహజంగానే సమర్థిస్తూ ఉన్నారు.
అలాగని అమరావతి మరీ అన్యాయం అయితే అయిపోదు. ఇప్పటికే అక్కడ భూముల ధరలు మంచి స్థాయిలో ఉన్నాయి. వాటి ధర కొంచెం తగ్గినా.. మరీ పతనం అయితే అయి పోదు. రాజధానిగా అమరావతి కూడా ఉంటుందని జగన్ ప్రకటించారు కూడా. ఇలాంటి నేపథ్యంలో కూడా అక్కడ కొంత అలజడులు సాగుతున్నాయి.
అయితే అదంతా కృత్రిమ ఉద్యమం అని అధికార పార్టీలోని కొంతమంది అంటున్నారు. వాటి వెనుక కొంతమంది స్పాన్సర్లు ఉన్నారని, వారు తెలుగుదేశం పార్టీ వారే అని అంటున్నారు. ఒక తెలుగు దేశం నేత అక్కడ ధర్నాలు, నిరసనల వెనుక కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారని వారు చెబుతున్నారు. ఈ కృత్రిమ ఉద్యమం వెనుక ఉన్న వారి వివరాలను బయటకు తీయడానికి ఇంటెలిజెన్స్ వర్గాలు పని మొదలు పెట్టినట్టు గా తెలుస్తోంది.