ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన సాగుతున్న తీరుపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆశ్చర్యం - విస్మయం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఎవరూ కూడా చంద్రబాబు మూడేళ్ల వ్యవధిలో చేసిన విదేశీ పర్యటనలు చేసి ఉండరని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు విదేశీ పర్యటనలు వెళ్లడం కొత్తేమి కాదన్నారు. ఇంతకు ముందుకు అనేక సందర్భాల్లో సింగపూర్ - జపాన్ - దాహోస్ - చైనా - మలేషియా - ఇప్పుడు అమెరికా పర్యటనకు వెళ్లారని తెలిపారు. విదేశాల్లో పెట్టుబడిదారులను ఆకర్శించి, పెట్టుబడుల వెల్లువ తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడతానని చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మూడేళ్ల వ్యవధిలో చంద్రబాబు పర్యటనల వల్ల ఏ మేరకు పెట్టుబడులు వచ్చాయే సమాధానం చెప్పాలన్నారు.
చంద్రబాబు గతంలో మాట్లాడుతూ..‘‘నాకు, వెంకయ్యకు ఇండియాలో పుట్టాలని ఎందుకనుకుంటాం. ధనవంతమైన అమెరికాలో పుట్టాలనుకుంటాం’’ అని చంద్రబాబు తన మనసులోని మాటను వెల్లడించారన్నారు. అంటే డబ్బుమీద, విలాసాల మీద, అమెరికా వంటి దేశాల మీద మోజు తప్ప భారత దేశంపైనా, ఆంధ్రరాష్ట్రం పైనా ఎలాంటి మమకారం లేదని అంబటి తెలిపారు. తన పర్యటనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఆశ్చర్యకర రీతిలో సాగుతోందని అంబటి వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటన వెళ్లిన చంద్రబాబు కాలిఫోర్నియా గవర్నర్ తో భేటీ కావడం, ఏపీ విభజన అశాస్త్రీయంగా జరిగిందని ఆయనకు వివరించినట్లు ప్రకటన విడుదల చేయడం విడ్డూరంగా ఉందని అంబటి అన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లి మన దేశంలో ఉన్న అంతర్గత విభేదాలను అక్కడ మాట్లాడటం చట్ట విరుద్ధమన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కాలిఫోర్నియా గవర్నర్‌తో ఇలాంటి విషయాలు చర్చించారంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి అర్హుడా అని ప్రశ్నించారు. మన రాష్ట్ర్ర సమస్యలు కాలిఫోర్నియ గవర్నర్ ఏం చేస్తారని, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని అంబటి మండిపడ్డారు. రాష్ట్ర విభజన కావాలని కోరుకుంది చంద్రబాబే అని అంబటి రాంబాబు తెలిపారు. రాష్ట్ర విభజనకు లేఖలు ఇచ్చింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. అసలు చంద్రబాబుకు మతిస్థిమితం సరిగా ఉందా? లేదా అన్నది అర్థం కావడం లేదని అంబటి మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రాన్ని విదేశాల్లో అవమానపరిచేలా వ్యవహరించడం సరికాదని అంబంటి కోరారు. విదేశీ పర్యటనలకు వెళ్లిన చంద్రబాబు ఏం సాధించారని ఆయన నిలదీశారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని విదేశీ పర్యటనలు చేయలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అన్నది ఒక దేశమని చంద్రబాబు భావిస్తూ..ఆయన వెళ్లి విదేశీ అధ్యక్షులతో నేరుగా మాట్లాడి పెట్టుబడులు తీసుకొస్తారన్న తప్పుడు అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నారని అంబటి వివరించారు. రాష్ట్రంలో దోచుకున్న డబ్బుతో విదేశాల్లో ఏవిధంగా పెట్టుబడులు పెట్టాలో పరిశీలించేందుకు చంద్రబాబు వెళ్తున్నారని ఆరోపించారు. విదేశీ పర్యటనలు విహార యాత్రలకు పరిమితం కాకూడదని హితవు పలికారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా విదేశీ పర్యటనలు ఉంటే సంతోషిస్తామని, లేకపోతే విమర్శిస్తామని స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/