ప్రపంచానికి పెద్దన్నగా ఉన్న అమెరికా.. ఏం చెప్పినా.. అందరూ నమ్మేస్తారని అనుకుంటుందో.. ఏమో.. తెలియదు కానీ.. నిత్యం ప్రపంచానికి నీతులు చెబుతుంది. అబ్బెబ్బే.. తాము ఏ పాపం ఎరుగం.. ప్రపంచ దేశాలే.. పాపాత్ములు అన్నట్టుగా.. వ్యవహరిస్తుంది. తాజాగా భారత్‌ను బద్నాం చేస్తూ.. తన పౌరులను హెచ్చరించింది. భారత్ లో పౌరుల ప్రాణాలకు రక్షణలేదని.. అక్కడకు వెళ్లే అమెరికా పౌరులు జాగ్రత్తగా ఉండాలని.. పేర్కొంది.
''భారత్‌లో అత్యాచారాలు ఎక్కువ. కిడ్నాపులు చేసి.. చంపేస్తారు. ఉగ్రవాద దాడులు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. తూర్పు లద్ధాఖ్, లేహ్ మినహా.. జమ్ము కశ్మీర్‌లోని ఇతర ప్రాంతాలు మరింత ప్రమాదక రం.. కాబట్టి.. ఆయా ప్రాంతాల్లో పర్యటించేపప్పుడు.. జాగ్రత్త'' అని అగ్రారాజ్యం తన పౌరులకు హెచ్చరిక లు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ట్రావెల్ అడ్వైజరీలో కొన్ని కీలక సూచనలు చేసింది.
కానీ, వాస్తవంగా చూస్తే.. అమెరికాలోనే పౌరుల ప్రాణాలకు ఏమాత్రం విలువ లేదనేది ప్రపంచ దేశాలకు తెలిసిన నిజం. తుపాకీ సంస్కృతి పెచ్చరిల్లిన అమెరికాలో ఎప్పుడు ఏక్షణం ఎక్కడ ఎలాంటి కాల్పుల మోతలు వినిపిస్తాయో.. తుపాకీ గుళ్ల వర్షం కురుస్తుందో .. అని పౌరులు.. ప్రాణ భీతితో అల్లాడిపోతున్న దేశం అమెరికా. ఈ విషయం ప్రత్యేకంగా ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడి అధికారులు.. ప్రభు త్వమే ఇటీవల ఆవేదన వ్యక్తం చేశాయి.
అంతేకాదు.. అమెరికాలో పట్టపగలు కిడ్నాపులు పెరుగుతున్న తీరు కూడా.. ఎఫ్‌బీఐ కళ్లకు కడుతోంది. సఫోల్క్ కౌంటీలో ఇటీవల జరిగిన.. వరుస ఘటనలు.. ఈ అపహరణల తీవ్రతకు అద్దం పడుతున్నాయి. అంతేకాదు.. స్కూళ్లలో జరుగుతున్న దారుణాలకు కూడా ఇవి సాక్షాలుగా నిలుస్తున్నాయి. కిడ్నాప్ చేస్తు న్నవారు.. ఫోన్లు చేసి.. మరీ హెచ్చరిస్తున్న దారుణ పరిస్థితి అమెరికాలో కనిపిస్తోంది.
కుటుంబ సభ్యులను అపహరించి.. భారీ ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్న సంఘటనలు కూడా నిత్యకృత్యంగా మారాయని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇస్తున్న నివేదికలే స్పష్టం చేస్తున్నాయి.
ఈ వర్చువల్ కిడ్నాపింగ్‌లకు వ్యతిరేకంగా.. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఫలితం ఉండడం లేదని కూడా.. ప్రజలు వాపోతున్నారు. నస్సావు కౌంటీ పోలీసు డిపార్టమెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ సంయుక్తంగా.. ఈ సమాచారం సేకరించి.. నిఘాపెట్టడాన్ని బట్టి.. అమెరికాలో ఎలాంటి పరిస్థితి ఉందో ఇట్టే అర్ధమవుతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.