ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరితీసిన ఉదంతంపై ఢిల్లీలోని జేఎన్ యూలో వర్థంతి సభ నిర్వహించటం.. ఈ కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించిన వారిపై దేశద్రోహం కేసు పెట్టటం.. దీనికి నిరసనగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. కమ్యూనిస్టు నేతలు రంగంలోకి దిగటం తెలిసిందే. ఈ రగడను బీజేపీ సీరియస్ గా తీసుకుంది.
ఒకవైపు.. జేఎన్ యూలో విద్యార్థులకు మద్దుతుగా నిలవాలంటూ లష్కరే తొయిబా అధినేత ట్విట్టర్ లో ట్వీట్ చేయటం వాతావరణం మరింత వేడెక్కేలా చేసింది. పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు మౌనంగా ఉండే ప్రధాని మోడీ.. ఆయనకు అత్యంత సన్నిహితులు.. పార్టీ చీఫ్ అమిత్ షాలు ఈసారి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
జేఎన్ యూ ఇష్యూ మీద బీజేపీ చీఫ్ అమిత్ షా తాజాగా గొంతు సవరించుకోవటమే కాదు.. రాహుల్ తీరును తీవ్రంగా తప్పు పడ్డారు. జాతీయభావానికి.. జాతి వ్యతిరేకతకు మధ్యనున్న వ్యత్యాసాన్ని రాహుల్ గుర్తించలేకపోయారంటూ మండిపడ్డ అమిత్ షా.. జేఎన్ యూలో విద్యార్థులు చేసింది ముమ్మాటికీ జాతి వ్యతిరేక చర్యగా తేల్చారు.
రాహుల్ తో సహా.. మరికొందరు నేతలు జాతివ్యతిరేక శక్తులకు వత్తాసు పలకటం ద్వారా దేశాన్ని విభజించాలని భావిస్తున్నారేమోనంటూ తీవ్రస్థాయిలో చెలరేగిపోయారు. మోడీ పాలన జర్మనీ హిట్లర్ పాలనను తలపిస్తుందన్న రాహుల్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ.. ఎమర్జెన్సీ విధించటం ద్వారా ఇందిరా గాంధీ హిట్లర్ గా వ్యవహరించిన విషయాన్ని అమిత్ గుర్తు చేశారు. హిట్లర్ వాదన కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని వ్యాఖ్యానించారు. అఫ్జల్ ను సమర్థిస్తున్న రాహుల్ ది ఎలాంటి దేశభక్తో వెల్లడించాలని నిలదీశారు.
ఉగ్రవాదుల్ని కీర్తించటం.. వారిని వెనకేసుకురావటం.. వారి వర్థంతుల్ని నిర్వహించిన వారికి కొమ్ము కాయటం.. వారికి మద్దుతుగా బయటకు రావటమే కాదు.. వారి భావజాలాన్ని సమర్థించటం ద్వారా ఈ దేశాన్ని రాహుల్ ఏం చేయాలనుకుంటున్నారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన వారిని కీర్తించటం వదిలేసి.. అమాయకుల ప్రాణాలు తీసే వారిని హీరోలుగా కొలవటం.. వారికి వర్థంతి సభల్ని ఘనంగా నిర్వహించే దరిద్రం ఏమిటన్న సందేహం రాహుల్.. కమ్యూనిస్టుల వైఖరిని చూసినోళ్లకు రాక మానదు.