పొత్తుల్లో ఉండే పార్టీలు సిద్ధాంతపరమైన వైరుధ్యం వల్ల.. పొత్తు బంధంనుంచి పక్కకు తప్పుకున్నంత మాత్రాన అది వెన్నుపోటు అవుతుందా? రాజకీయ పార్టీల మధ్య పొత్తులు అనేవి సాధారణంగా వారి వారి అప్పటి అవసరాలకు అనుగుణంగానూ, చాలా అరుదుగా వారి పార్టీల సిద్ధాంతాల మధ్య సారూప్యత కారణంగానూ ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇలా సిద్ధాంతాల మధ్య విభేదాలు వచ్చినప్పుడు , లేదా అవసరాలు తీరిపోయినప్పుడు పొత్తులు బెడిసికొడుతుంటాయి కూడా. పొత్తు బంధం వీడిపోవడాన్నే వెన్నుపోటుగా అభివర్ణిస్తే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? బీహార్‌ఎన్నికల ప్రచారంలో నితీశ్‌ను కార్నర్ చేయడానికి భాజపా సారథి అమిత్‌షా చేస్తున్న ప్రచారాన్ని విన్నవారికి ఇలాంటి సందేహాలే కలుగుతున్నాయి.
బీహార్ ప్రచార సభలో అమిత్ షా మాట్లాడుతూ.. నితీశ్ కుమార్ ను వెన్నుపోటు దారుడిగా అభివర్ణించారు. ఎన్డీయే నుంచి వెలుపలికి వెళ్లిపోయినందుకు ఈ విమర్శలు చేశారు. ఇప్పుడు అధికారం కోసం.. ఆయన లాలూతో చేతులు కలిపారని కూడా దెప్పిపొడిచారు. లాలూతో చేతులు కలపడాన్ని పచ్చి అవకాశ వాదంగా అమిత్ షా అభివర్ణించారు.
అయితే ఆయన మాటలు గమనించిన విశ్లేషకుల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోవడమే గనుక వెన్నుపోటు అయ్యేట్లయితే.. మహారాష్ట్ర ఎన్నికల సమయంలో శివసేన చేసిందేమిటి? శివసేనను కూడా వెన్నుపోటు దారుల పార్టీ అనగల దమ్ము భాజపాకు ఇవాళ ఉన్నదా? అదే మహారాష్ట్రలో ఎన్నికల తర్వాత.. శివసేన మద్దతుతోనే భాజపా అధికారంలోకి వచ్చింది. మరి అది పచ్చి అవకాశ వాదం కాకుండా మరేమిటి?
ఇలా తన వీపు మీద బోలెడంత నలుపు రంగు పెట్టుకుని.. దాన్ని గురించి తెలుసుకోకుండా.. ఎదుటివారి వీపు మీద ఉన్న నలుపురంగును చూసి తెగనవ్విన గురివింద గింజ నీతి లాగా.. అమిత్‌షా వైఖరి కనిపిస్తున్నదని పలువురు విమర్శిస్తున్నారు.