అమెరికాలో మరొకడు ఇష్టారాజ్యంగా కాల్చేశాడు

Update: 2016-02-26 06:15 GMT
అమెరికా ఉలిక్కిపడింది. గన్ కల్చర్ అధికంగా ఉండే అగ్రరాజ్యంలో.. విచక్షణారహితంగా కాల్పులు జరిపే ధోరణి ఈ మధ్యన మరింత ఎక్కువ అవుతోంది. తాజాగా అలాంటిదే మరోసారి చోటు చేసుకుంది. కాన్సస్ రాష్ట్రంలోని హెస్టాన్ అనే ప్రాంతంలో ఒక వ్యక్తి ఇష్టారాజ్యంగా కాల్పులకు తెగబడ్డాడు. ఇతని ఆరాచకానికి ఏడుగురు అమాయకులు బలి కాగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. అమెరికాలో సంచలనం రేపిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

ఒక ఫ్యాక్టరీలో పెయింటర్ గా పని చేస్తున్న సెడ్రిక్ ఫోర్డ్ ఈ ఆరాచకానికి పాల్పడినట్లు గుర్తించారు. కంపెనీలోని పార్కింగ్ లాబ్ లో ఒక మహిళను కాల్చేసిన సెడ్రిక్.. అసెంబ్లీ ఏరియాలోకి ప్రవేశించి.. విచక్షణారహితంగా కాల్పులు జరపటం మొదలు పెట్టాడు. ఊహించని ఈ పరిణామానికి షాక్ తిన్న వారు తేరుకునే లోపే భారీ నష్టం వాటిల్లింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని ఎదురుకాల్పులు జరపటంతో సెడ్రిక్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కాల్పులు జరిపిన సెడ్రిక్ వద్ద ఒక ఏకే 47 తుపాకీతో పాటు.. 9ఎంఎం గన్ కూడా ఉన్నట్లు గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
Tags:    

Similar News