మనదేశ సైనికసామర్థ్యం మరింత పెరుగనున్నది. భారత అమ్ములపొదిలోకి మరో అత్యాధునిక ఆయధం రాబోతున్నది. డీఆర్డీఏ తాజాగా మరో అడ్వాన్స్డ్ టౌడ్ ఆర్టిలెరీ గన్ సిస్టం ( ఏటీఏజీఎస్) అనే అత్యాధునిక ఆయుధాన్ని తయారుచేసింది. ఈ ఆయుధాన్ని ఇటీవలే విజయవంతంగా పరీక్షించారు. చైనా , పాకిస్థాన్ వంటి దేశాలతో తరుచూ సరిహద్దు వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో సైనికసంపత్తిని పెంచుకొనేందుకు భారత కీలక అడుగులు వేస్తున్నది. ఇప్పటికే రాఫెల్ వంటి అత్యాధునిక ఆయుధాలను మనదేశం దిగుమతి చేసుకున్నది.
ఆత్మనిర్భర్ భారత్ భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతోనే అధునాతన ఆయుధాలను తయారుచేస్తున్నారు. శనివారం నిర్వహించిన ఏటీఎజీఎస్ పరీక్షలు విజయవంతం అయ్యాయి. 48 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని సైతం ఈ అధునాతన ఆయుధాలు ఛేదించనున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని తయారుచేసినట్టు ప్రాజెక్టు డైరెక్టర్ శైలేంద్ర పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి ఆయుధాలను తయారుచేసే సామర్థ్యం భారత్కు ఉన్నదని ఆయన చెప్పారు. అయితే ఏటీఏజీఎస్ ఆయుధాన్ని తాజాగా చైనా సరిహద్దుల్లో విజయవంతంగా పరీక్షించారు.
ఈ ఆయుధాలు సుదూర లక్ష్యాలను కూడా చేరుకోగలవని.. నిమిషానికి ఐదురౌండ్ల కాల్పులు జరపుతాయని చెప్పారు. అయితే కొంతకాలంగా లద్ధాక్ సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. ఇప్పటికే కొంతమంది సైనికులు కూడా ఇక్కడ అమరులయ్యారు. తాజాగా భారత్ రఫెల్ విమానాలను కొనుగోలు చేయడం.. స్వదేశీ పరిజ్ఙానంతో ఆయుధాలు తయారుచేసుకోవడం శుభపరిణామే.