త్వరలో 'కరోనా' ను మరపించే మరో భయంకరమైన మహమ్మారి !

Update: 2021-02-13 07:30 GMT
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతటి మహావిలయం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపుగా ఏడాదికి పైగా ఈ మహమ్మారి దెబ్బకి మొత్తం ప్రపంచం జీవన విధానమే మారిపోయింది. కొన్ని రోజులు లాక్ డౌన్ లోనే జీవించారు. ఇప్పుడిప్పుడే కరోనా ను అరికట్టే వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే , ఈ మహమ్మారి వివిధ రకాల్లోకి రూపంతరం చెందుతుండటంతో ఆందోళన పెరిగిపోతుంది. అయితే , ప్రపంచంలో కరోనా లాంటి మహమ్మారులు అనేకం ఇంకా పొంచి ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

గత ,కొన్నేళ్ల కిందటే డిసీజ్ ఎక్స్ అనే ప్లేస్ హోల్డర్ ను గుర్తించింది. అయితే, ఇది ఇంకా వెలుగులోకి రాలేదని, ఒక్కసారి ఈ డిసీజ్ వెలుగులోకి వస్తే తీవ్రమైన మహమ్మారిగా మారే అవకాశం ఉంటుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరికలు జారీచేశారు. ఇప్పటి నుంచి ప్రపంచ దేశాలు మహమ్మారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ కొత్త వైరస్ జూనోటిక్ వ్యాధుల వలన వచ్చే అవకాశం ఉందని, ఇది జంతువుల నుంచి మనుషులకు సంక్రమించవచ్చని నిపుణులు చెప్తున్నారు. గతంలో అనేక మహమ్మారులను మానవాళి ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ప్లేగ్ మహమ్మారి వలన 75 మిలియన్ మంది మరణించారు.

కరోనా వైరస్ తో 2.3 మిలియన్ల మంది మృత్యువాత పడ్డారు. రాబోయే కాలంలో కొత్త మహమ్మారుల వలన 75 మిలియన్ కంటే ఎక్కువ మంది మరణించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అడవుల నరికివేత, వ్యవసాయం విస్తరణ, మైనింగ్ తవ్వకాలు, అడవి జంతువుల వేట వంటి వాటి వలన మహమ్మారులు ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్నాయని, సమతుల్యత కోల్పోవడంతో కొత్త కొత్త మహమ్మారులు పుట్టుకు వస్తున్నట్టు నిపుణులు చెప్తున్నారు. భవిష్యత్తులో కరోనా కంటే తీవ్రమైన డిసీజ్ ఎక్స్ మహమ్మారులు వచ్చే అవకాశం ఉన్నట్టు ఎబోలా వ్యాధిని గుర్తించిన బృందంలో ఒకరైన డాక్టర్ జీన్ జాక్వెస్ ముయుంబే తెలిపారు.

‘డిసీజ్‌ ఎక్స్’ అనే వ్యాధి ఖచ్చితంగా కొత్త వ్యాధి కాదని, ఇంకా కనుగొనబడని సంభావ్య వ్యాధిగా అభిప్రాయపడుతున్నారు పలువురు వైద్య పరిశోధకులు. డిసీజ్ ఎక్స్ అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 2018 ఫిబ్రవరిలో స్వీకరించిన ప్లేస్‌ హోల్డర్ పేరు అని వారు చెప్తున్నారు. ఇది కొత్తగా కనుగొన్న ముప్పు కాదని, భవిష్యత్ ‌లో ఉద్భవించి, మహమ్మారికి కారణమయ్యే ఒక ఊహాత్మక వ్యాధి అని వారంటున్నారు. అయితే, ‘డిసీజ్ ఎక్స్’ అనేది కొత్తగా కనుగొన్న ముప్పున్న వ్యాధి కాకపోయినపక్షంలో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు అని ఇంకొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు.


Tags:    

Similar News