ఏపీ ఎమ్మెల్యేల పీఏల ద్వారా సీఎంవో ఆఫీస్‌ కు రిపోర్టులు!

Update: 2022-05-11 03:28 GMT
ఏపీలో ఎమ్మెల్యేల‌పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిఘా పెట్టారా?  ఎమ్మెల్యేలు.. ఏం చేస్తున్నారు?  ఎక్క‌డికి వెళ్తున్నారు?  ఎలా వ్య‌వ‌హ రిస్తున్నారు? ఎక్క‌డెక్క‌డ ఎలాంటి క‌క్కుర్తి ప‌నులు ప‌డుతున్నారు?  వంటి అన్ని ర‌కాల స‌మాచారాన్ని సేక‌రిస్తున్నారా?  అంటే .. ఔన‌నే అంటున్నారు ముఖ్య‌మంత్రి కార్యాల‌య అధికారులు. వ‌చ్చే ఎన్నికల‌కు సంబంధించి.. ఎమ్మెల్యేల్లో గుబులు రేగింది. అంటే.. ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌నిచేసేవారికి.. గ్రాఫ్ బాగున్న‌వారికి మాత్ర‌మే టికెట్ ఇస్తామ‌ని.. లేనివారిని నిర్దాక్షిణ్యంగా ప‌క్క‌న పెడ‌తామ‌ని.. కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఇది చాలా మందిలో గుబులు రేపింది.

దీంతో దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌నే సూత్రాన్ని వారు అనుస‌రిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. అంటే.. ఎమ్మెల్యేగా ఉండ‌గానే.. ప‌రిస్థితిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని.. నాలుగు రాళ్లు వెనుకేసుకేంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి టికెట్ ద‌క్కినా.. ద‌క్క‌క పోయినా.. మ‌రో పార్టీలోకి అయినా.. వెళ్లి.. టికెట్ తెచ్చుకుని.. పోటీ చేయొచ్చ‌నే ఆలోచ‌న‌లో దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నార‌ని తెలుస్తోంది. అస‌లు విష‌యానికి వ‌స్తే.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున చాలా మంది కొత్త ముఖాలు రంగంలోకి దిగాయి. వారంతా కూడా.. జ‌గ‌న్ సునామీతో విజ‌యం ద‌క్కించుకున్నారు.

తొలి ఏడాది బాగానే ఉన్నా.. త‌ర్వాత నుంచి ఇసుక‌, మ‌ట్టి, మ‌ద్యం ఇలా.. అనేక అక్ర‌మాలు చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వారిపై వ‌చ్చాయి. దీనిపై ప్ర‌తిప‌క్షాలు కూడా విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టాయి. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం కూడా ఇంటిలిజెన్స్ నివేదిక‌లు తెప్పించుకుంది. ఎందుకంటే.. ఎక్క‌డ ఏం జ‌రిగినా.. ఎవ‌రు రూపాయి తిన్నా.. వెంట‌నే దాని ఎఫెక్ట్ సీఎం జ‌గ‌న్‌పై ప‌డుతోందని, అందుకే.. సీఎంవో నుంచి నేరుగా.. పార్టీ ఎమ్మెల్యేపై ప్ర‌భుత్వం నిఘా పెట్టింద‌నే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు.. ఏం చేస్తున్నారు.. అనే విష‌యాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం తెప్పించుకుంటున్నార‌ని స‌మాచారం.

ప్ర‌స్తుతం ఎమ్మెల్యేల‌కు ఉన్న పీఏల‌ను ప్ర‌భుత్వ‌మే ఏర్పాటు చేసింది. సో.. వారు ఎమ్మెల్యేఆ నుపానుల‌ను పూర్తిగా తెలుసుకుం టారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నార‌నే విష‌యాల‌ను స‌ద‌రు పీఏల ద్వారా సీఎంవో సేక‌రిస్తున్న‌ట్టు వైసీపీలోనే పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఎమ్మెల్యేలు.. ఈ అవినీతి క్ర‌మంలో టీడీపీ నేత‌ల‌తోనూ.. క‌లిసి పంప‌కాలు చేసుకుంటున్నార‌నే ఆరోప‌ణ‌లు కూడా పార్టీ అదిష్టానానికి తెలిసింద‌ని అంటున్నారు. బ‌హుశ ఈ విష‌యాల‌ను ప‌సిగ‌ట్టేనేమో.. ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నిక‌ల్లో అన్ని సీట్ల‌ను గెల‌వాల‌ని.. అన్నారు. ప్ర‌భుత్వం చేసిన సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లి వివ‌రించాల‌ని సూచించారు.

ఇదేస‌మ‌యంలో ఆయ‌న గెల‌వ‌ని.. వాళ్ల‌కు ఈ సారి సీట్లు ఇచ్చేది లేద‌ని.. కూడా ప‌రోక్షంగా చెప్పేశారని అంటున్నారు. ఈ జాబితాలో దాదాపు 50 శాతం మంది ఉన్నార‌ని.. అందుకే.. ఎమ్మెల్యేలు ముందుగానే చక్క‌బెట్టుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఎక్క‌డిక‌క్క‌డ అవినీతికి పాల్ప‌డి.. వ‌చ్చిన డ‌బ్బునురిజ‌ర్వ్ చేసుకుంటున్నార‌ని ఒక టాక్ న‌డుస్తోంది. రాబోయే ఎన్నిక‌ల్లో .. ఒక వేళ సీటు రాక‌పోతే.. ఎలా అని ఆలోచిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలో ఇప్పుడే.. స‌ర్దుకుంటున్నార‌ని.. చెబుతున్నారు.రేపు వైసీపీ నుంచి సీటు రాక‌పోతే.. డబ్బ‌యినా ఉంటే.. టీడీనీ. జ‌న‌సేన‌, లేదా బీజేపీలో అయినా చేరేందుకు రెడీ అవుతున్నార‌ని చ ర్చ న‌డుస్తోంది.

డ‌బ్బులు ఉంటే.. ఎక్క‌డ  ఏపార్టీలో అయిన‌.. చేరిపోయి.. టికెట్ తెచ్చుకోవ‌చ్చని భావిస్తున్నార‌ట‌. ఇవ‌న్నీ.. గ‌మ‌నించిన వైసీపీ అధిష్టానం.. ఇప్ప‌టి నుంచే దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగిన‌ట్టు తెలుస్తోందని అంటున్నారు. దీనిలో భాగంగానే త‌మ బంధువు, ఒకే ఇంటిపేరు ఉన్న వైఎస్ కొండారెడ్డిని కూడా అరెస్టు చేయించార‌ని వైసీపీ స‌ర్కిళ్ల‌లో చ‌ర్చ సాగుతోంది.  మ‌రి ఈప‌రిణామాల త‌ర్వా తైనా.. ఎమ్మెల్యేలు.. ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News