ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ - ఆయన కుటుంబ సభ్యుల జెరూసలెం పర్యటన కోసం రూ.22.52 లక్షలు మంజూరు చేసింది. దీంతో ముఖ్యమంత్రి ఆధ్యాత్మిక పర్యటనకు ప్రభుత్వ నిధులెందుకు అంటూ బీజేపీ విమర్శిస్తోంది. కుటుంబసభ్యులతో కలిసి జగన్ జెరూసలెం వెళ్తున్నది పూర్తిగా వ్యక్తిగత పర్యటన. అలాంటి వ్యక్తిగత పర్యటనకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడాన్ని బీజేపీ తప్పుపడుతోంది.
ఆగస్టు 1 నుంచి 4 వరకు సాగుతున్న ఈ పర్యటన తరువాత జగన్ దిల్లీలో రెండు రోజుల పాటు ఉండనున్నారు. 5వ తేదీన దిల్లీలో దిగిన తరువాత ఆయన రెండు రోజుల పాటు అక్కడే మకాం వేసి కేంద్ర మంత్రులు కొందరిని కలవనున్నారు.
జగన్ పర్యటన కోసం జులై 26 విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకున్నారు. ఈ సందర్భంలో అందులో ఈ పర్యటనను పూర్తిగా వ్యక్తిగత పర్యటన గానే పేర్కొన్నారు.
ఇది పూర్తిగా ప్రయివేటు పర్యటన అయినప్పుడు జగన్ - ఆయన కుటుంబ సభ్యులు జెరూసలెం వెళ్లేందుకు ప్రభుత్వం రూ.22.52 లక్షలు ఎందుకు విడుదల చేస్తోందని బీజేపీ ప్రశ్నిస్తోంది. అంతేకాదు.. దీని వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడదా అని ఆ పార్టీ నేత లంకా దినకర్ ప్రశ్నించారు.