మద్యం దుకాణాలు తెరిచాయి. అయితే దుకాణాలు తెరవకముందే చాలా రాష్ట్రాలు మందుబాబులకు షాకిచ్చాయి. భారీగా మద్యం ధరలు పెంచేస్తూ నిర్ణయం తీసుకోవడంతో వారు ఖంగుతిన్నారు. నెలన్నర తర్వాత మద్యం దుకాణాలు తెరవడంతో మొదటి రోజు ఎలాగైనా తాగాలని చాలామంది ధరలు ఎలా ఉన్నా మద్యం కొనుగోలుకు బారులు తీరారు. పెద్దసంఖ్యలో మద్యం దుకాణాలు తరలివచ్చారు. తొలి రోజు ముగిసింది. అయితే ఇప్పుడు మద్యం ధరల పెంపుపై పునరాలోచనలో పడ్డారు. ఎక్కడ తక్కువ ధర ఉందో అని వెతికి అక్కడ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఇప్పుడు మందుబాబుల వలసలు మొదలయ్యాయి. ఇన్నాళ్లు వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్న దృశ్యాలు చూశాం. ఇప్పుడు మందు కోసం ఇతర రాష్ట్రాల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడింది.
మద్యం దుకాణాలు ప్రారంభిస్తూనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 25 శాతం ధరలు పెంచేసింది. అయితే ఆ తర్వాత రోజు 50 శాతం ధరలు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో మందుబాబులకు తొలిరోజు తాగిన కిక్కు వెంటనే పోయింది. భారీగా ధరలు పెంచడంతో షాక్ కు గురయిన మందుబాబులు ఏం చేయాలో తెలియని పరిస్థితికి వెళ్లారు. రెట్టింపు స్థాయిలో ధరలు పెంచడంతో కొనుక్కొని తాగాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించారు. పక్క రాష్ట్రం తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా ఉన్నాయి. సీఎం కేసీఆర్ కేవలం 16శాతం పెంచడంతో మద్యం ధరలు ఏపీతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయని గుర్తించి తెలంగాణకు రావడం మొదలుపెట్టారు. రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోని మందుబాబులు తెలంగాణకు వచ్చి మద్యం కొనుగోలు చేస్తూ ఉపశమనం పొందుతున్నారు.
తెలంగాణకు ఏపీ సరిహద్దు రాష్ట్రం. సరిహద్దుగా తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలు నల్గొండ - మహబూబ్ నగర్ - ఖమ్మం ఉన్నాయి. ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వారు తెలంగాణలోకి వచ్చి మద్యం కొనుగోలు చేస్తూ తీసుకెళ్తున్నారు. ఖమ్మం జిల్లాలోని మధిర - సత్తుపల్లి నియోజకవర్గాలకు ఏపీలోని కృష్ణాజిల్లా - అశ్వరావు పేట నియోజకవర్గానికి పశ్చిమగోదావరి - భద్రాచలం నియోజకవర్గానికి తూర్పుగోదావరి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ జిల్లాల్లోని మందుబాబులు ఖమ్మం జిల్లాలోని మద్యం దుకాణాలకు వచ్చి మందు కొనుక్కుని వెళ్తున్నారు.
తెలంగాణలో 16 శాతం - ఏపీలో 75 శాతం మేర ధరలు పెరిగాయి. ఏపీతో పోలిస్తే తెలంగాణలో చాలా తక్కువగా ధరలు ఉండడంతో ఏపీవాసులు తెలంగాణకు మందు కోసం వస్తున్నారు. దీంతో తెలంగాణలోకి ఆంధ్రప్రదేశ్ వాసులు వస్తూ మద్యం కొనుగోలు చేస్తూ వెళ్తున్నారు. ఈ పరిస్థితి ఉమ్మడి నల్గొండ - మహబూబ్ నగర్ - ఖమ్మం జిల్లాలో ఉంది.