ఆన్ లైన్ ద్వారా గవర్నర్ ప్రసంగం ..దేశంలోనే తొలిసారి!

Update: 2020-06-16 06:15 GMT
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రోజురోజుకూ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో ఉభయ సభలు సమావేశం కాబోతోండటం వల్ల చరిత్ర లో నిలిచి పోయేలా కొన్ని ప్రత్యేక సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి.  ఈ ఉదయం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.

రాష్ట్రంలో వైరస్  వ్యాప్తి, ఆయన వయసును దృష్టిలో ఉంచుకుని, అసెంబ్లీకి వెళ్లవద్దని అధికారులు సూచించడంతో, రాజ్ భవన్ నుంచే ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇండియాలో ఓ గవర్నర్ ఇలా ఆన్ లైన్ ద్వారా అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడటం ఇదే తొలిసారి. గవర్నర్ తన ప్రసంగంలో తన ప్రభుత్వం ఓ నవ శకానికి నాంది పలికిందని , ఏపీ అసెంబ్లీని మిగతా రాష్ట్రాలు అనుసరించనున్నాయని అంచనా వేశారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తూ, ఏడాది వ్యవధిలోనే అన్ని వర్గాల ప్రజలకూ దగ్గరైందని తెలిపారు. ప్రభుత్వం చెప్పిన హామీలనే కాకుండా ..చెప్పని హామీలని సైతం అమలు చేస్తుంది అని చెప్పారు.  కాగా, గవర్నర్ ప్రసంగం తరువాత, మధ్యాహ్నం ఒంటి గంటకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బడ్జెట్ ప్రతిపాదనలను సభ ముందు ఉంచనున్నారు.
Tags:    

Similar News