ఐఫోన్ ఇప్పుడు ద‌ర త‌గ్గించింది

Update: 2017-03-06 16:46 GMT
యాపిల్ సంస్థ ఐఫోన్ 6 - 6 ప్లస్ స్మార్ట్‌ ఫోన్లను ఇది వరకు 16 జీబీ, 64 జీబీ, 128 జీబీ వేరియెంట్లలో విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఐఫోన్ 6కు చెందిన 32జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ ను యాపిల్ తాజాగా విడుదల చేసింది. భారత్‌ తోపాటు పలు ఆసియా దేశాల్లో ఈ మోడల్ ప్రత్యేకంగా వినియోగదారులకు లభిస్తోంది. ఈ ఫోన్‌ ను యూజ‌ర్లు రూ.28,999 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.  ఇందులో తాజా క‌బురు ఏంటంటే... రూ.10వేల త‌క్కువ ధ‌ర‌కు ఈ ఫోన్లు అందుబాటులోకి వ‌స్తాయి.

యాపిల్‌ కు చెందిన ఐఫోన్ 7 - 7 ప్లస్‌ లపై రూ.10వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఐఫోన్ 7 32జీబీ - 128 జీబీ - 256 జీబీ వేరియెంట్లతోపాటు ఐఫోన్ 7 ప్లస్ 32 జీబీ - 128 జీబీ వేరియెంట్లు రూ.10వేల తక్కువ ధరకే ఇప్పుడు వినియోగదారులకు లభ్యమవుతున్నాయి. ఈ ఫోన్లను వరుసగా రూ.49,999 - రూ.59,999 - రూ.69,999 - రూ.61,999 - రూ.71,999 ధరలకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News