ట్రంప్ దెబ్బకు అమెరికాలోని యూనివర్సిటీలు - ప్రముఖ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యాభ్యాసానికి దరఖాస్తులు చేసుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో 26% - గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో 15 శాతం దరఖాస్తులు తగ్గాయి. 250కి పైగా అమెరికా కాలేజీలు - యూనివర్సిటీల్లో అడ్మిషన్ దరఖాస్తులపై ఆరు అగ్రశ్రేణి అమెరికా ఉన్నత విద్యాసంస్థలు ఓపెన్ డోర్స్ 2016 అనే పేరుతో నిర్వహించిన సర్వే వివరాలు ఈ వారాంతంలో వెల్లడి కానున్నాయి. సగటున విదేశీ విద్యార్థుల దరఖాస్తులు 40 శాతం తగ్గుముఖం పట్టాయని తెలుస్తోంది.
ప్రస్తుతం అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న విదేశీ విద్యార్థుల్లో భారత్ - చైనా నుంచే 47 శాతం మంది ఉంటారు. అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు వీసా పర్మిట్లు నిరాకరించడం కూడా ఆ దేశంలో విద్యాభ్యాసానికి దరఖాస్తు చేసుకునే భారత్ - చైనా - నేపాల్ విద్యార్థుల సంఖ్య తగ్గుదలకు మరో కారణం. ఇక చైనా నుంచి అండర్ గ్రాడ్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 25% - గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో 32 శాతం దరఖాస్తులు తగ్గిపోయాయి. పోర్టుల్యాండ్ యూనివర్సిటీలో భారతీయ విద్యార్థుల దరఖాస్తులు 27 శాతం తగ్గాయి.
విద్యార్థి వీసాపై వచ్చే వారికి మూడేండ్ల ఓపీటీ తరువాత హెచ్ 1 బీ వీసా పొందే అవకాశం ఉంటుం ది. కానీ హెచ్ 1 బీ, ఓపీటీ విధానాల్లో పరిమితులు విధిస్తారనే అనుమానాలు కూడా విద్యార్థుల దరఖాస్తులు తగ్గిపోవడానికి కారణమని చెప్తున్నారు. ట్రంప్ ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ప్రభావం వివిధ విద్యాకోర్సుల్లో అడ్మిషన్లపై ఉంటుందని అక్కడి యూనివర్సిటీల అధికారులే ఓపెన్ గా చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/